Home » సువార్త అంటే ఏమిటి?

సువార్త అంటే ఏమిటి?

క్రైస్తవ జీవితానికి సువార్త ప్రధానమైనది. క్రీస్తును అనుసరించేవారికి అది నిరీక్షణ, దృఢమైన పునాది,‌ మరియు సందేశం . సువార్త సంఘ నిర్మాణానికి దృఢమైన పునాది.

మనం సువార్త అనే పదాన్ని ఉపయోగించినప్పుడు ఏం సూచిస్తున్నామో దానిపై స్పష్టత ఉండాలి. సువార్త యొక్క నిర్వచనాన్ని చూసే ముందు, సువార్త అంటే ఏమి కాదో తెలుసుకోవడం చాలా అవసరం

క్రైస్తవ జీవితానికి సువార్త ప్రధానమైనది. క్రీస్తును అనుసరించేవారికి అది నిరీక్షణ, దృఢమైన పునాది,‌ మరియు సందేశం . సువార్త సంఘ నిర్మాణానికి దృఢమైన పునాది.

మనం సువార్త అనే పదాన్ని ఉపయోగించినప్పుడు ఏం సూచిస్తున్నామో దానిపై స్పష్టత ఉండాలి. సువార్త యొక్క నిర్వచనాన్ని చూసే ముందు, సువార్త అంటే ఏమి కాదో తెలుసుకోవడం చాలా అవసరం.

  • సువార్త అంటే పరలోకానికి వెళ్ళే మార్గం గురించి కాదు? సువార్త నిత్యజీవాన్ని వాగ్దానం చేస్తుంది కానీ, అది సువార్త కాదు.
  • సువార్త అంటే “దేవుణ్ణి ప్రేమించు , నీ పొరుగువానిని ప్రేమించు ” అనే నినాదంకాదు. ఈ ఆజ్ఞలు నిజానికి సువార్తకు కేంద్రమైనవే అయినప్పటికీ అవి సువార్త కాదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మ శాస్త్రమంతటికీ సారాంశం.
  • సువార్త మనం నెరవేర్చాల్సిన పని లేదా సాధించే లక్ష్యం కాదు.
  • దురదృష్టవశాత్తు “సువార్త కరపత్రాలు ” సహాయకరంగా ఉన్నా కానీ , చాలా గందరగోళానికి దారితీస్తుంటాయి. సువార్త అంటే ఏమిటో సగటు క్రైస్తవుడిని అడగండి చాల వరకు మీకు దాని నిర్వచనం రాదు కానీ ప్రదర్శన (Presentation) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సువార్త ప్రదర్శనల్లో ( Gospel Presentation ) సువార్త ఉండవచ్చు, కానీ అది సువార్త కాదు.

కాబట్టి, సువార్త అంటే ఏమిటి?


సువార్త కేవలం వార్త. గ్రీకు పదమైన ఎవాంజెలియన్ అనేదానికి వార్త, ప్రకటన లేదా సందేశం అనే అర్థం వస్తుంది. సువార్త మనం నెరవేర్చాల్సిన పని లేదా సాధించే లక్ష్యం కాదు కానీ వేరొకరు మన కోసం ఇప్పటికే ప్రతిదీ వేరవేర్చి, సాధించి , అనుసరించారన్న వార్త. ఇది మంచి వార్త, ఎందుకంటే, అది మన మీద ఆధారపడిలేదు కాబట్టి.

సువార్త అనేది తన సమాఖ్య అధిపతి నుండి పతనమైన మనిషిని విముక్తి చేయడానికి , క్రీస్తులో అన్ని విషయాలు విమోచించబడతాయనే నిరీక్షణను మనిషికి ఇవ్వడానికి యేసు క్రీస్తులో దేవుడు చేసిన కార్యాలను గురించిన అద్భుతమైన వార్త.


సువార్త అనేది తన సమాఖ్య అధిపతి నుండి పతనమైన మనిషిని విముక్తి చేయడానికి , క్రీస్తులో అన్ని విషయాలు విమోచించబడతాయనే నిరీక్షణను మనిషికి ఇవ్వడానికి యేసు క్రీస్తులో దేవుడు చేసిన కార్యాలను గురించిన అద్భుతమైన వార్త. దేవుడు తన వాగ్దానాల విషయంలో ఎంత నమ్మకంగా ఉంటాడో అనేదానికి సువార్త ఒక రుజువు.సువార్త దేవుని విశ్వసనీయత సంకల్పం, దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు.

What is Gospel


సరళంగా చెప్పాలంటే, సువార్త యేసు యొక్క జీవితం, మరణం మరియు పునరుత్థానం. ఆయనను విశ్వసించే వారందరికీ పునరుద్ధరణ. యేసు తన జీవితంలో , ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు , ప్రతి విషయంలో దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన పాపుల తరపున నీతిని సాధించాడు. తన మరణంలో, యేసు మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు, దేవుని ఉగ్రతను సంతృప్తిపరిచాడు మరియు నమ్మిన వారందరికీ క్షమాపణ పొందుపరిచాడు. తన పునరుత్థానంలో, యేసు పాపం మరియు మరణాన్ని జయించాడు అదేవిదంగా వాటి మీద మనకు విజయాన్ని ఆయన ద్వారానే హామీ ఇచ్చాడు.


ఇది బైబిల్ ప్రకటించే సువార్త.

Author
Isaac

Further reading

పాపం అంటే ఏంటి?

పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి.