మానవ జీవితం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?

ప్రశ్న: మానవ జీవితం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?

 దేవుని వాక్యంలో మానవ జీవితానికి రెండు ప్రధాన ఉద్దేశాలు ఉన్నట్లుగా మనము చూస్తాము.
మొదటిది దేవుడిని మహిమ పరచడానికి [a] , రెండొవది ఆయనలో ఆనందించుటకు. [b]

వివరణ :

ప్రతి మనిషికి వచ్చే ప్రశ్నే ఇది. నేను ఎందుకు పుట్టానో , నా జీవితానికి అర్ధం ఏమిటి? మతశాస్త్రంలో ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న.మానవుడు చేసిన ప్రతి వస్తువుకి ఎలా ఉపయోగాలు ఉంటాయో, అలానే దేవుడు చేసిన మనిషితో కూడా అలానే ఉపయోగం ఉంది. ఆయనను మహిమపరచడానికి దేవుడు మనలను చేశాడు. అంటే మనం చేసే ప్రతి పని, ఆలోచన కూడా అయన మహిమ కోసమే చేయాలనేదే దాని అర్ధం. పాపం ఈ లోకం లో ప్రవేశించడంతో దేవునికి మనిషికి మధ్య అగాధం ఏర్పడింది. కానీ ఆ అగాధం క్రీస్తుయేసు ద్వారా మనము మళ్ళి దేవునితో జతపరచబడ్డాము. ఆయనతో, ఆయనలో నిత్యమూ జీవించడమే దేవుని ముఖ్య ఉద్దేశం, అందుకే తన కుమారుడైన యేసు క్రీస్తుని మీద నమ్మకం ఉంచి, మారుమనస్సు పొందుట ద్వారా ఆయనతో మనకు నిత్యజీవము.

[a] కీర్తనలు 86:9, యెషయా 60:21, రోమా 11:36, 1 కొరింథీ 6:20, 1 కొరింథీ 10:31, ప్రకటన 4:11

[b]కీర్తనలు 16:5-11., కీర్తనలు 114:15, యెషయా 12:2, లూకా 2:10, ఫిలిపి 4:4, ప్రకటన 21:3-4

 

 

 

The Westminster Shorter Catechism (also known simply as the Shorter Catechism) was written in the 1640s by English and Scottish divines.

Author
Isaac

Further reading

పాపం అంటే ఏంటి?

పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి.

EP 01 : Introduction

Welcome to life and Scripture: Discovering God’s truth for everyday living. Welcome to the very first episode of Life and Scripture ! I’m...