క్రొత్తగా తిరిగి జన్మించబడడం: నిజమైన మార్పునకు పునాది
క్రైస్తవ జీవితం అనేది దేవుని యొక్క అద్భుతమైన కార్యంతో ప్రారంభమవుతుంది. ఆ గొప్ప కార్యం ఏమనగా పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించబడడం.
1 పేతురు 1:4
“మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను”.
“క్రొత్తగా తిరిగి జన్మించడం” అనగా నైతికమైన అభివృద్ధి లేదా వ్యక్తిగత సంకల్పం గురించి కాదు. ఒక పాపిని క్రీస్తులో నూతన సృష్టిగా రూపాంతరం చెందించే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒక అసాధారణమైన పని (2 కోరంథి 5:17). నూతనంగా తిరిగి జన్మించడం అనేది ఒక దైవశాస్త్రమునకు సంబంధించిన అంశము కాదు. ఇది ప్రతి ఒక్క విశ్వాసి యొక్క వ్యక్తిగత ఎదుగుదల మరియు పరిశుద్ధతకు ఒక పునాది.
క్రొత్తగా తిరిగి జన్మించబడడం అనగా ఏమిటి? (What is Regeneration?)
రీజనరేషన్ అనగా క్రొత్తగా తిరిగి జన్మించడం. ఇది దేవుడు చేసే క్రియ. ఈ క్రియలో తన పాపముల చేత తన ఆత్మీయ స్థితిలో చచ్చిన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి యొక్క జీవితం లోనికి ఒక ఆత్మీయమైన జీవాన్ని దేవుడు ఇస్తాడు (ఎఫేసి 2:1-5). ఇది రక్షణ శాస్త్రములో కీలకమైన అంశం. ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మానవుని యొక్క అంతరంగములో జరిగేటువంటి పని.
ఇది కేవలం భౌతికమైన లేదా స్వాభావికమైన మార్పు మాత్రమే కాదు ఇది ఒక మానవుని యొక్క అంతరాత్మను పరిపూర్ణంగా పునరుద్ధీకరిస్తుంది. ప్రభువైన ఏసుక్రీస్తు నికోదేముతో చేసిన సంభాషణలో ఈ క్రియ ని “క్రొత్తగా జన్మించడం” అని సంబోధించాడు.
యోహాను 3:3
అందుకు యేసు అతనితో, “ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను”.
దైవశాస్త్రపరంగా చూస్తే కొత్తగా జన్మించడం అనేది నీతిమంతులుగా తీర్చబడడం, దత్తపుత్రులవ్వడం, మరియు పవిత్రీకరించబడడం అనే అంశాలకి వేరైనప్పటికీ, వీటన్నిటి నుండి ఏమాత్రం విడదీయని బంధాన్ని కలిగి ఉంది.
కొత్తగా జన్మించడంలో పరిశుద్ధాత్ముని యొక్క కార్యము
కొత్తగా జన్మించడం అనేది పూర్తిగా దేవుని యొక్క కార్యము.
తీతుకు 3:5
“మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను”.
కొత్తగా జన్మించబడడం అనేది మానవుని కృషి ఫలితం, నిర్ణయాలు లేదా యోగ్యత వల్ల కాదు అని ఈ సత్యము తేటగా సెలవిస్తుంది. ఇది పరిశుద్ధాత్ముని యొక్క సార్వభౌమ కార్యము, పరిశుద్ధాత్ముడు ప్రభువైన ఏసుక్రీస్తు వారి యొక్క రక్షణ కార్యమును వ్యక్తిగతంగా అన్వహించి మరణము నుంచి జీవములోనికి నడిపిస్తాడు.
కొత్తగా తిరిగి జన్మించబడడం యొక్క అవసరత
కొత్తగా తిరిగి జన్మించబడడం ఎందుకు అవసరం? బైబిల్ చెబుతుంది కొత్తగా తిరిగి జన్మించకపోతే, సమస్త మానవాళి అందరూ కూడా ఆత్మీయంగా చచ్చినవారుగా ఉన్నారు (ఎఫెసీ 2:1) మరియు దేవునిని వెతకడానికి కానీ లేదా సంతోష పరచడానికి కానీ సాధ్యము కాదు (రోమా 3:10-12; 8:7-8).
యోహాను 3:6
“శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది”.
సాధారణమైన జన్మ భౌతికమైన జీవితాన్ని ఇస్తుంది కానీ ఆత్మీయమైన జీవితాన్ని ఇవ్వదు. పరిశుద్ధాత్ముడు మాత్రమే మన ఆత్మలని కొత్తగా తిరిగి జన్మింపజేసి దేవునితో బ్రతకడానికి, సత్యమును గ్రహించడానికి సహకరిస్తాడు.
కొత్తగా తిరిగి జన్మించబడడం యొక్క ఫలితాలు
- నూతన స్వభావం – క్రొతగా తిరిగి జన్మించబడడం ఫలితంగా ప్రాథమికంగా ఒక వ్యక్తి యొక్క స్వభావంలో మార్పు వస్తుంది. (2 కోరింథీ 5:17)
- దేవునికి విధేయత చూపగల మనస్సు – నూతన జన్మ రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను ఇస్తుంది. (యెహేజ్కేలు 36:26)
- విశ్వాసము మరియు పశ్చాతాపము – విశ్వాసము మరియు పశ్చాతాపము యొక్క మూలం. (అపో. 16:14)
- క్రీస్తుతో ఐక్యపరచబడడం – క్రీస్తుతో మన జీవితం సమపరచడం. (రోమీయులకు 6:4)
- **5. దేవుని పట్ల మరియు ఇతరుల పట్ల ప్రేమను పెంపొందింప చేస్తుంది – ** నూతన జన్మ దేవునిని గాఢంగా ప్రేమించడానికి మరియు ఇతరుల మంచి కోరడం మరియు శ్రద్ధ చూపించడానికి సహకరిస్తుంది.
- **పాపాన్ని ఎదిరించడానికి శక్తినిస్తుంది : విశ్వాసి పాపాన్ని ఎదిరించడానికి మరియు పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతకడానికి పరిశుద్ధాత్ముడు శక్తిని అనుగ్రహిస్తాడు. **
- **ఆత్మీయ ఎదుగుదల కొరకు కోరిక : విశ్వాసంలో ఎదగడానికి బైబిల్ ని చదవడానికి ఆరాధనలో మరియు ప్రార్ధనలో నిమగ్నములు కావడానికి పరిశుద్ధాత్ముడు సహకరిస్తాడు. **
క్రొత్తగా తిరిగి జన్మించబడడం మరియు పవిత్రీకరించబడడం
కొత్తగా జన్మింపజేయడం అనే దేవుని యొక్క పని విశ్వాసి జీవితంలో కొత్తగా తిరిగి జన్మింపజేయడంతోనే ఆగిపోదు కానీ ఇది పవిత్రికరించబడడానికి ప్రారంభం. కొత్తగా తిరిగి జన్మించబడడం మన యొక్క స్వభావాన్ని మారుస్తూ ఉండగా మరియు దేవునితో సరియైన సంబంధాన్ని ఇస్తుండగా, పవిత్రకరించబడడం అనేది మన జీవితంలో మనము మరణించేంతవరకు పరిశుద్ధాత్ముడు మనలని ఏసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మారుస్తూ ఉంటాడు (రోమా 8:29).
ఈ సంబంధం మనకు ఏం తెలియజేస్తుందంటే క్రొత్తజన్మ అనేది కేవలము నిత్య జీవము లోనికి తీసుకొని వెళ్లడం మాత్రమే కాదు కానీ ప్రస్తుతం ఉన్న జీవితంలో రూపాంతరం చెంది, పరిశుద్ధత, దేవునికి విధేయత అనే లక్షణాల ద్వారా మనలను గుర్తింపచేస్తుంది.
ఫిలిప్పీయులకు 1:4 ఈ వచనం మనకు గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
“మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను”.
కొత్తగా తిరిగి జన్మించబడడం అనేది మన జీవితంలో పరిశుద్ధాత్ముడు మనము దేవుని యొక్క మహిమలో పరిపూర్ణులు అయ్యేంతవరకు మనలో పవిత్రీకరించడం అనే పని కొనసాగుతూనే ఉంటుందని వాగ్దానమునుస్తుంది.
క్రొత్తగా తిరిగి జన్మించబడడం యొక్క వెలుగులో బ్రతకడం
కొత్తగా తిరిగి జన్మించడం అనే సిద్ధాంతము మనము క్రీస్తులో నూతన గుర్తింపు కలిగి బ్రతకడానికి మనలను సవాలు చేస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది. మనము పరిశుద్ధాత్ముని ద్వారా కొత్తగా జన్మించబడినట్లైతే మన జీవితాలు కూడా ఆ సత్యమును బట్టి రూపాంతరం చెందబడాలి.
అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు 4:22-24 వచనాలలో ఈ విధంగా ప్రోత్సహిస్తున్నాడు.
“కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదలుకొని 23 మీ చిత్తవృత్తియందు నూతన పరచబడినవారై, 24 నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను”.
ఆచరణాత్మకంగా దీనికి అర్థం ఏమిటంటే, ప్రతిరోజు మనము పరిశుద్ధాత్ముని మీద ఆధారపడి బ్రతకడం, పాపాన్ని ఎదిరించడానికి ఆయన సహాయాన్ని వెతకడం, పరిశుద్ధతలో ఎదగడం, మనం చేసే సమస్త పనిలో దేవునిని మహిమ పరచడం. కొత్తగా తిరిగి జన్మించబడడం అనేది మనలో నిజమైన మార్పు అనేది మన యొక్క సంకల్ప శక్తి వల్ల పొందుకోలేము కానీ పరిశుద్ధాత్ముడు మన జీవితంలో చేసే రూపాంతర పరచడం అనే పని మీద ఆధారపడి ఉంటుంది.
ముగింపు
కొత్తగా తిరిగి జన్మించబడడం అనేది క్రైస్తవ జీవితానికి ఒక మూల రాయి. పరిశుద్ధాత్ముని కార్యము ద్వారా మనం దేవుని మహిమలో పరిపూర్ణులు అయ్యేంతవరకు ఆయన మనలో పని కొనసాగిస్తాడు.
ఫిలిప్పీయులకు 1:4
“మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను”.
కొత్తగా తిరిగి జన్మించబడడం అనేది మన జీవితంలో పరిశుద్ధాత్ముడు మనము దేవుని యొక్క మహిమలో పరిపూర్ణులు అయ్యేంతవరకు మనలో పవిత్రీకరించడం అనే పని కొనసాగుతూనే ఉంటుందని వాగ్దానమునుస్తుంది.
రండి! పరిశుద్ధాత్ముని శక్తితో బ్రతుకుతూ, క్రీస్తుతోపాటు మనలని బ్రతికింపజేసినటువంటి ఆయనను మహిమపరచుదాం!
– Translated by Pastor Shyam Pasula
📖 Read in English 👉 Regeneration: The Foundation of True Change