Home » నిత్య జీవానిచ్చే’దేవుని నీతి’

నిత్య జీవానిచ్చే’దేవుని నీతి’

పాపిని దేవుడు నీతిమంతునిగా ఒక్కసారే ప్రకటిస్తాడు కానీ, పాపిని పరిశుద్ధ పరిచే కార్యం మాత్రం జీవితకాలమంతా చేస్తుంటాడు.

దేవుని నీతి – డేనియల్ సూర్య

కేవలం విశ్వాసమూలంగానే దేవుడు పాపులను నీతిమంతులుగా తీర్చబడతారు అన్న అంశము సంస్కరణ సమయంలో అతి ప్రాముఖ్యమైనది. రోమన్ కేథలిక్ సంఘపు వాక్య విరుద్ధమైన బోధలను మార్టిన్ లూథర్ ఖండించడానికి ఈ సిద్ధాంతము మూలము. ఇది కొత్తగా కనుకొన్న సిద్ధాంతము కాదు, ఈ సిద్ధాంతాన్ని పౌలు రోమా సంఘానికి బోధించిన అంశము. క్రైస్తవ విశ్వాసానికి ఇది కేంద్రంగా ఉన్న సిద్ధాంతం. ప్రతి క్రైస్తవుడు ఈ సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడం చాలా అవసరము.

“కేవలం విశ్వాసమూలంగానే దేవుడు పాపులను నీతిమంతులుగా తీర్చబడతారు” అన్నది కేవలము ఒక సిద్ధాంతంగానే లేదు, అది క్రైస్తవ అనుదిన జీవితానికి కేంద్రగా ఉంది. క్రైస్తవ జీవితమంతా ఈ సిద్ధాంతం పై ఆధారపడి ఉంది. మన రక్షణకు, సువార్తకు కేంద్రంగా ఉన్న ఈ సిద్ధాంతాన్ని అర్ధం చేసుకోకపోతే , మనము తప్పు దారిలో పడి ,దేవుడు క్రీస్తులో మనకి ఇచ్చిన స్వేచ్చను అనుభవించలేము.

[one_half] పాస్టర్ డేనియల్ సూర్య ఆవుల రచించిన “దేవుని నీతి” అనే పుస్తకములో , ఈ సిద్ధాంతాన్ని సూటిగా , వాక్యానుసారమైన వివరాన్ని స్పష్టంగా ఇచ్చారు. అంతేకాదు, ఈ సిద్ధాంతం చుటూ ఉన్న కొన్ని ప్రశ్నలకీ , వక్రీకరణలకు సమాధానాలను ఈ పుస్తకములో ఉన్నవి.

దేవుడు యేసుక్రీస్తు ద్వారా నీతిని ఉచితమైన బహుమతిగా పాపులందరికి అందుబాటులో ఉంచాడని చేయడమే ఈ పుస్తకము యొక్క ముఖ్య ఉండదేశము. నీతిమంతునిగా తీర్చబడడం అంటే అర్ధం ఏమిటి? దానికి ఆధారమేమిటి? దేవుడు ఎప్పుడు పాపిని నీతిమంతునిగా ప్రకటిస్తాడు? నీతి ఆపాదించబడుట అంటే ఏమిటి? అన్న ముఖ్యమైన ప్రశ్నలకు ఈ పుస్తకములో మనకు చూడవచ్చు.

అలాగే, ఈ పుస్తకము ద్వారా మన చుట్టూ ఉన్న అబద్ద బోధలను, అపోహలను మనము తెలుసుకోవడమే కాకుండా, ఈ సిద్ధాంతము యొక్క పూర్తి అవగాహనా వలన వాటి నుండి మనల్ని మనము రక్షించుకోగలుగుతాము. అది క్రైస్తవ బాధ్యత.

[/one_half] [one_half_last] [/one_half_last]
  • పాస్టర్ డేనియల్ సూర్య, వాక్యాన్ని కేంద్రంగా మాత్రమే చేసుకొని వివరించారు. అయన చేసిన వ్యాఖ్యలకి , బైబిలు నుండి రుజువులు చూపించారు.
  • ఇది రోమా పత్రిక వ్యాఖ్యానం. మీరు మీ అనుదిన బైబిల్ అధ్యయనానికి తోడుపడుతుంది. ఈ పుస్తకములో 5 చాఫ్టర్లు ఉన్నాయి.
    రోమా 1-8 అధ్యాయాలలో “దేవుని నీతి” అన్న అంశమును కేంద్రంగా చేసుకొని వాక్యనాసహిత వ్యాఖ్యానాన్ని 5 పుస్తక అధ్యాయాలలో విశదపరచారు.
  • మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఎంతో సహాయపడుతుంది. ఈ సిద్ధాంతాన్ని స్పష్టంగా తెలుసుకోవడం వలన దేవున్ని మీరు ఇంకా ఆత్మతోను, పూర్ణమనస్సు తోను ఆరాదించగలుగుతారు. మీ జీవితశైలి మారుతుంది.

పాస్టర్ దానియేలు సూర్య రచించిన “దేవుని నీతి” అను పుస్తకము ప్రతి తెలుగు క్రైస్తవ గృహములో ఉండవలసిన పుస్తకము. మీకు, మీ వ్యకిగత ఆత్మీయ జీవితానికి , కుటుంభానికి మేలు చేసే పుస్తకము.

ఈ పుస్తకము, కావలసిన వారు హితబోధ బుక్స్ స్టోర్ లో పొందవచ్చు.

వేరొక పుస్తకంతో మళ్ళీ కలుసుకుందాం.

Author
Isaac

Further reading

పాపం అంటే ఏంటి?

పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి.