నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.”
అపొస్తలుల కార్యములు 24:14-15
అపొస్తలుడైన పౌలు ఒకసారి కైసరయలో ఉన్న అధికారుల యెదుట నిలబడి ఇలా అన్నాడు:
“నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.”
అపొస్తలుల కార్యములు 24:14-15
ఆ కాలంలో, యేసు క్రీస్తును అనుసరించేవారిని యూదుల్లో ఒక చిన్న వర్గం అని పిలిచేవారు . ఒక కొత్త అభిప్రాయబద్ధమైన గ్రూప్ లాగా కనిపించేవారు. కానీ పౌలు అలా అనలేదు. ఆయన చాలా స్పష్టంగా, కొంత భిన్నంగా చెప్పాడు.
పౌలు చెప్పినదేమిటంటే — “మార్గం” అనేది కొత్త మతం కాదు , అది అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకు దేవుడు చేసిన వాగ్దానాల యొక్క నిజమైన కొనసాగింపు, “సంఘం” అనేది కొత్త సమూహం కాదు అది దేవుని ప్రణాళికలో తదుపరి దశ, అది దేవునితో నిబంధనలో ఉన్న నిజమైన ప్రజలు.
కాబట్టే బైబిలు దానిని మార్గము అని పిలుస్తుంది. క్రైస్తవ్యము అన్ని మార్గాలలోఒక మార్గం కాదు, అది ఏకైక మార్గం. ప్రభువైన యేసు క్రీస్తు తానే ఇలా అన్నారు:
“నేనే మార్గము, సత్యము, జీవము; నా ద్వారా కాక మిగులెవరును తండ్రియొద్దకు రారు” (యోహాను 14:6).
మనము యేసు క్రీస్తును ఆరాధిస్తున్నాము అంటే , పాత నిబంధనలో విశ్వాసముగల యూదులు ఆరాధించిన అదే దేవునిని ఆరాధిస్తున్నాము.
పౌలు ఇంకొకటి కూడా చెప్పాడు — ఈ మార్గంలో నడిచే వారు,నీతిమంతులకును , అనీతిమంతులుకును,ఇద్దరికీ పునరుర్థానము ఉంటుందని విశ్వాసము ఉంటుంది. (అపొస్తలుల కార్యములు 24:15).
ఒక రోజు అన్ని మనుషవర్గాలవారు లేస్తారు . కానీ అందరికీ ఒకే భవిష్యత్తు ఉండదు.
దానియేలు 12:2 ఇలా చెబుతోంది:
“మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు”
కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి—మనము ఏ మార్గంలో ఉన్నాం?
యేసు క్రీస్తులో విశ్వాసం వలన న్యాయబద్ధత పొందినవారు—వారు మహిమ వైపు ప్రయాణిస్తున్న వారు.
మీరు ఆ మార్గంలో ఉన్నారా?