Home » ఆందోళనను ఎలా పోరాడాలి?

ఆందోళనను ఎలా పోరాడాలి?

నేను పని చేస్తున్న కంపెనీ వారు మార్కెటింగ్ చేయడానికి కొన్ని సమావేశాలకి వెళ్తూ ఉంటారు. వారు తిరిగివచ్చినపుడు తమతో వారికి ఇచ్చిన మార్కెటింగ్ వస్తువులను తీసుకొని వస్తారు. ఒకసారి ఆలా తీసుకొని వచ్చిన వాటి నుండి మాకు నచ్చినవి తీసుకోమన్నారు. నా ద్రుష్టి ఒక మెరిసే వస్తువు పయిన పడింది. కొద్దీ కాలంగా నేను ఏ షాప్ కి వెళ్లినా ఇది చూస్తున్నాను . దానిని ఫైడ్జెట్ స్పిన్నర్ అంటారు. ఇది ఒక చిన్న బొమ్మ పరికరం. నేను దానిని పట్టుకొని అది ఎలా పనిచేస్తుందో అని చూస్తున్నపుడు నా మేనేజర్ , “నువ్వు ఒత్తిడి లో ఉన్నావా అది తీసుకున్నావు” అన్నారు. నేను అయోమయంతో లేదు అన్నాను. అప్పుడు ఆమె “ఇది ఒత్తిడి లో ఉన్న వారు, ఉపశమనం కోసం వాడుతారు” అని అన్నారు. కొద్ది సేపు అయ్యాక నేను నా డెస్క్ దెగ్గరకు వెళ్ళాక దీనిని గురించి చదివాను. వికీపీడియాలో,” సమస్యలతో సతమతమయ్యేవారికి మానసిక ఒత్తిడి ఉన్నవారికి ఉపయోగించుకొనుటకు దీనిని కనుకొన్నారని , ఆందోళన లో ఉన్న వారిని నెమ్మదిపరచుటకు , ఇతర నాడీ సంభందితలోపములు అనగా ADHD ,ఆటిజం తో బాధపడుతున్నవారికి ఇది సహాయపడుతుందని, అయితే ఇంతవరకు ఈ పరికరం ఆటిజం లేదా ADHD చికిత్సకు ప్రభావితము చేస్తుందని ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు.” అని పేర్కొన్నారు. నేను దాని గురించి చదివేటప్పుడు, బాగా తెలిసిన వాక్యభాగం నాకు గుర్తొచింది . అది ఫిలిప్పీ 4:6-7 వచనాలు ,”దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 7 అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును.

అయితే ఈ ఆందోళన ఎలాగా ఉంటుంది?

[one_half] పరిస్థితులన్ని మనకి అనుకూలంగా ఉంటే మనం సంతోషిస్తాం, అలాగ జరగనప్పుడు మనం అధైర్యపడతాం, ఆందోళనకి గురవుతాం . దేనినైనా ఆశించి అది పొందలేకపోతానేమో అన్న భయం దానికి తోడైతే వచ్చేదే ఆందోళన లేక చింత అని జాన్ పైపర్ అన్నారు. నేను ఎవరిని పెళ్లి చేసుకుంటానో,ఉద్యోగం ఎక్కడ వస్తుందో. అసలు వస్తుందో రాదో, పరీక్షలు పాస్ అవుతానో లేదా? నాకు జీవితంలో విజయం వస్తుందో రాదో ,నాకు జబ్బు నయమౌతుందో లేదో ఇవన్నీ ఆందోళనకు ఉదాహరణాలు. రాబోవు జీవితం గురించి ఘోరంగా ఉహించుకొని ఎప్పుడు దానిగురించే ఆలోచిస్తూఉండడం చింతకు గుర్తులు.[/one_half][one_half_last][quote]చింతించడం పాపం అని గ్రహించడం ఆందోళనను అధిగమించడానికి మొదటి మెట్టు[/quote][/one_half_last]

ఆందోళన(చింత )నీ జీవితంలో ఎలాంటి దుష్ప్రభావాలు తెస్తుంది ?

1. ఈ ఆందోళనతో నీవు కృంగిపోతావు(సామెతలు 12:25). లోకాములో ఉన్న సమస్యలన్నీ నీ భుజముపై ఉన్నట్లు అనిపిస్తుంది.
2. దేనిమీద ద్యాసం ఉండదు. విసుకు వస్తుంది , అది మన ఆత్మీయుల మీద చుపిస్తావు.
3. శాంతి సమాధానాలకు దూరం చేస్తుంది.
4. దేవుని వాగ్దానాలను మర్చిపోయేలా చేస్తుంది.
5. దేవుని తో సహవాసాన్ని కోల్పోతావు.

మరి దీనిని ఎలా అధిగమించగలము?

ఆందోళనకు లక్ష కారణాలు ఉండవచ్చు, కానీ దాని వలన చెడుజరుగుతుందే కానీ మంచి ఏ మాత్రం ఉండడు.  అయితే దీనికి నివారణ ఏమిటి? యేసు క్రీస్తు ఈ సమస్య గురించి మత్తయి 6:25-34 లో ప్రస్తావించారు. అయన మన సమస్యలు ఎరిగి లెక్కచేయకుండా ఉండలేదు.

25అందువలన నేను మీతో చెప్పునదేమనగాఏమి తిందుమో యేమి త్రాగు దుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి;
26 ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?
27 మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?
28 వస్త్రములను గూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలో చించుడి. అవి కష్టపడవు, ఒడకవు
29 అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు.
30 నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయ ముగా వస్త్రములు ధరింపజేయును గదా.
31 కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.
32 ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును.
34 రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.

ఈ వాక్యభాగం గమనిస్తే “అందువలన… ” తో ప్రారంభమైంది. క్రీస్తు , ధనము వలన కలిగే ఆందోళన గూర్చి మాట్లాడుతూ పలికిన మాటలివి(మత్తయి 6:19-24). ఇక్కడ ధనము ఒక కారణం కానీ ఇది ఆందోళనకి కారణమైన ప్రతి విషయానికి వర్తిస్తుందని మనం గమనించాలి. ఈ వాక్యభాగంలో “చింతింపకుడి” అని మూడు సార్లు చెప్పి , మనము ఎందుకు చింతించకూడదో ఐదు కారణాలు ఇచ్చారు.
1. పక్షులను, పువ్వులను పోషించే వాడు మన ప్రభువే ,తన ప్రాణాన్ని సైతం లెక్కచేయక మనకోసం ప్రాణం పెట్టిన వాడు మనలను మర్చిపోతాడా?
2. చింతించుటవలన ఏమి సాధించగలము ? ఇది అర్ధం లేని పని.
3. నిజ దేవుడు ఎవరో తెలియని వారు ఆందోళన చెందుతారు. దేవుడే ఎరిగిన ప్రజలుగా మనము ఎంత అభయము తో ఉండాలి!
4.మన అవసరాలు మనకంటే ఎక్కువగా తెలిసిన దేవుని మీద నమ్మకం ఉంచుదాం .
5. మనము అయన రాజ్యమును నీతిని మొదట వెదకుదాం ; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును అని దేవుడు మనకి వాగ్దానం చేసాడు. మనం దీనిని విశ్వసించాలి.

దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 7 అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును.

ఫిలిప్పీయులు కూడా చాల రకాల ఆందోళనకు గురిఅయ్యారు . వారు బయట నుంచి వచ్చే వ్యతిరేకతతో (ఫిలిప్పీ 1:28 ) పాటు సంఘము లో వచ్చిన వ్యతిరేకతను( ఫిలిప్పీ 4:2 ) కూడా ఎదుర్కొన్నారు. మనము ఎదుర్కొనే సమస్యలని ఖచ్చితంగా ఈ కారణాలతో పోల్చుకోవచ్చు. ఫిలిప్పీ 4:6-7 లో పౌలు ఈ సమస్యను పోరాడుటకు మూడు విషయాలు చెప్పాడు. ఈ విషయాలు చెప్పేటప్పుడు పౌలు బహుశా మత్తయి 6:25-34 ని దృష్టి లో ఉంచుకొని ఉండవచ్చు.

మొదటిది, చింతించొద్దు అని చెప్తున్నాడు. ఇది దేవుని ఆజ్ఞ , మనము ఇది చేయనట్లయితే పాపము చేసినవారమౌతాము. చింతించడం పాపం అని గ్రహించడం ఆందోళనను అధిగమించడానికి మొదటి మెట్టు. అంతే కాక 1 పేతురు 5:7 లో అయన మనకు బదులుగా చింతించుచున్నాడు గనుక మన చింత యావత్తు ఆయనమీద వేద్దాం.

రెండొవదిగ, ప్రార్ధన చేయమని చెప్తున్నాడు. విజ్ఞాన శాస్త్రం ఆందోళనను ఎదుర్కోవడానికి యోగా, మసాజ్ , పాటలు వినడం వంటి సూచనలు ఇచ్చినప్పటికీ దేవుడు మనకిస్తున్న విరుగుడు ప్రార్థన. ఆందోళన వచ్చినప్పుడు మన మనస్సులు శాంతిని ,సమాధానాన్ని కోలుపోతాము. పౌలు, ప్రార్ధన చేసినప్పుడు మన సమస్యలు తీరిపోతాయని చెప్పట్లేదు కానీ సమాధానము మనకు లభిస్తుందని అంటున్నాడు . ఈ సమాధానము పరిశుద్దాత్మ దేవుడు మనకిచే వాగ్దానము తో కూడిన ఆశీర్వాదం. ఆందోళన చెందినపుడు మనము మర్చిపోయేదే ప్రార్ధన. ఒకవేళ ప్రార్ధన చేసినా, దేవుని మీద పూర్తిగా ఆదారపడకుండా చేస్తాము. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే నువ్వు ప్రార్ధిస్తున్నావా? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మనకి ఇస్తాను అని వాగ్దానము చేసిన దేవుడు ఇవ్వక ఊరకుండునా?(మత్తయి 7:1). దేవుడు మనకిచ్చిన్న ఈ వాగ్దానాన్నీ గుర్తుతెచ్చుకొని ఈ సమస్యను ప్రార్థనాలో పోరాడుదాం. .

ఆకరిగా , పౌలు విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు దేవునికి తెలియజేయుమని చెప్తున్నాడు. బాధలో ఉన్నపుడు కృతజ్ఞత మనసు ఎలా వస్తుంది అన్నది మీ ప్రశ్నయితే , పౌలు తాను ఎక్కడ నుంచి ఈ లేఖ రాస్తున్నాడో గ్రహించాలి. పౌలు ఈ లేఖ రాస్తున్నప్పుడు జైలు లో సంకెళ్లతో బంధీగా ఉన్నాడు(ఫిలిప్పీ 1:12-14 ). కష్టాలలో ఉన్నపుడు, బాధ, చింతలో ఉన్నపుడు కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాములు దేవుని యెదుట తెలియచేయాలని పౌలు మాటలలో స్పష్టముగా అర్ధమవుతుంది . 1 పేతురు 5:7 మరియు కీర్తనలు 55:22 లో కూడా మనము ఇదే చూస్తాము.

కనుక, ఒక్కమాటలో చెప్పాలంటే ఆందోళన కి విరుగుడు ప్రార్ధన. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను విశ్వసించి, ప్రార్ధన ద్వారా ఆందోళనను పోరాడుదాం. ప్రార్థన ద్వారా కలిగే సమాధానంతో భర్తీ చేసి,  దేవుని మహిమకై జీవిద్దాం.

Author
Isaac

Further reading

పాపం అంటే ఏంటి?

పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి.