చిరకాల ప్రేమ

ప్రేమికుల రోజుకు చీకటి చరిత్ర ఉంది. పురాతన రోము లో ఇది అన్యులు ఆచరించే భూసార పండుగ అని చరిత్రకారులు విశ్వసించారు. జంతుబలులు మరియు ఇతర క్రూరమైన ఆచారాలతో వ్యవసాయ దేవుడైన ఫానస్కుకు , బలులు అర్పించేవారు.

ప్రేమికుల రోజుకు చీకటి చరిత్ర ఉంది. పురాతన రోము లో ఇది అన్యులు ఆచరించే భూసార పండుగ అని చరిత్రకారులు విశ్వసించారు. జంతుబలులు మరియు ఇతర క్రూరమైన ఆచారాలతో వ్యవసాయ దేవుడైన ఫానస్కుకు , బలులు అర్పించేవారు.

క్రీస్తుశకం 270 లో సంభవించిన వాలెంటైన్స్ మరణం లేదా ఖననం యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి నెల మధ్యలో ప్రేమికుల రోజు జరుపుకుంటారని కొందరి అభిప్రాయం , ఈ సంప్రదాయం కొనసాగుతూ భారతదేశంతో సహా వివిధ ఖండాలకు వ్యాపించింది. కొంతమందికి, ఇది సంతోషాన్ని మరియు విలాసాన్ని కలిగిస్తే , మరికొందరికి తమ ప్రియులను కోల్పోయిన వారై వారితో కలిసి ఈ రోజుని సంతోషంగా గడపలేక పోతున్నందుకు బాధ!

[one_half]

మొదటి శతాబ్దంలో, రోమా సామ్రాజ్యాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఒక వ్యక్తి నివసించేవాడు. అతను బీదలను ప్రేమించి నమ్మకాన్ని కలిగించాడు. (లూకా 4:18).రోగులను ప్రేమించి వారిని స్వస్థపరచాడు (యోహాను 6: 2, మత్తయి 10: 8); వితంతువులను ఆదరించాడు (1 తిమో 5: 3); పిల్లలను ప్రేమించాడు (మత్తయి 19:14), తనను ద్వేషించిన వారిని ప్రేమించాడు (మత్తయి 10: 6), అయినప్పటికీ అతను నేరస్థుడిలా మరణించాడు. అయన పేరే యేసు క్రీస్తు . అతను చేసిననేరం ప్రేమించుటయే.[/one_half] [one_half_last][quote] దేవుడు ప్రేమ గనుక మనలను ప్రేమించెను కానీ, మనము ప్రేమించదగిన వారమని ప్రేమించలేదు.[/quote][/one_half_last]

యేసు కేవలం వాలెంటైన్ లాంటి మనిషి మాత్రమే కాదుకానీ , సజీవుడైన దేవుని కుమారుడు.(మత్తయి 16:16; కొలొస్సయులు 1:15).
రాబోయే ఉగ్రత నుండి పాపులను రక్షించుటకు దేవుడు , క్రీస్తుని ఈ లోకానికి పంపించాడని బైబిల్ చెప్తుంది(యోహాను 3:16, రోమా 6:23). దేవుడు ఈలాగు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఎవరు నశించట ఆయనకు ఇష్టం లేదు. పాపము చేత దేవునికి విరోధులుగా అయిన మనలను, ప్రేమించి , మనకి రావలసిన ఆ మరణ శిక్షను తనపై వేసుకొని, మనకు అయన నీతిని ఆపాదించి స్నేహితుడయ్యాడు, మన స్థానంలో మరణించాడు (రోమా 5: 8, ఫిలిప్పి 2: 8,యోహాను 15:13).

పాపము చేత విరోధులమై ఉండగా క్రీస్తు మనకొరకు చనిపోయెనని నిజంగా గ్రహించినప్పుడే ఈ ప్రేమను మనము అర్ధం చేసుకోగలం.( రోమా 5:8). అయన ప్రేమ గనుక మనలను ప్రేమించెను కానీ, మనము ప్రేమించదగిన వారమని ప్రేమించలేదు. దేవుడు మనలను తన నిత్య ప్రేమతో ప్రేమించి తన రాజ్యమునకు వారసులుగా చేయుటకు మనలను ఎంచుకొనెను(1 యోహాను 4: 8).

గనుక, మనము దేవుని ప్రేమను రుచిచూచిన వారముగా ఒకనినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు (1 యోహాను 4: 8)

Author
Isaac

Further reading

పాపం అంటే ఏంటి?

పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి.

EP 01 : Introduction

Welcome to life and Scripture: Discovering God’s truth for everyday living. Welcome to the very first episode of Life and Scripture ! I’m...