దేవుడు పాపిని, నీతిమంతుడిగా తీర్చుట

న్యాయ వ్యవస్థలో, ఒక నేరస్థుడు న్యాయమూర్తి ముందు తన నేరం నిరూపించబడి నిలబడినప్పుడు, అతను తనను తాను అపరాధభావంతో కనుగొంటాడు; మరియు అతని శిక్ష తాను చేసిన నేరంపై ఆధారపడి ఉంటుంది. అతను చేసిన తప్పుకి అతనే శిక్ష అనుభవించవలసియున్నది కానీ, వేరొకరు అతనికి బదులుగా శిక్షను పొందడానికి చట్ట వ్యవస్థ ఒప్పుకోదు. అతని పై ఆరోపించబడిన నేరము తప్పు అని నిరూపించబడితేనే కానీ తాను నిర్దోషిగ పరిగణింపబడడు.

అందరు పాపం చేసి దేవుడనుగ్రహించిన మహిమను పొందలేకపోవుచున్నారు అని రోమా 3:23లో మనము చూస్తాము. అలాగే; నీతిమంతుడు ఒక్కడును లేడు అని రోమా 3:10లో చూస్తాము, అయితే దేవుని ముందు ఒకపాపి నీతిమంతునిగా ఎలా ఎంచబడతాడు?

[one_half]పరిశుద్దుడైన దేవుని ముందు శిక్షకుపాత్రుడైన దోషిగా నిలబడడం తప్ప పాపికి వేరొక స్థితి లేనేలేదు. దేవుడు న్యాయవంతుడు కనుక పాపికి తీర్పు తీర్చుడంలో సమర్ధవంతుడు. కానీ, ఆ పాపి క్రైస్తవునిగా మారి దేవుని ఎదుట నిలబడినప్పుడు, ఆ వ్యక్తిని క్షమించి, అతను చేసిన పాపమును ,నేరమును కొట్టివేసి అతను చేసిన వాటికి పొందవలసిన శిక్షను శాశ్వతంగా తొలగిస్తున్నాడు. ఇది ఎలా సాధ్యమౌతుంది? అతను చేసిన పాపము ఏమవుతుంది?[/one_half][one_half_last][quote] పాపి యేసుక్రీస్తుపై నమ్మకం ఉంచిన క్షణంలోనే, దేవుడు పాపిని నీతిమంతుడిగా ప్రకటిస్తాడు.[/quote][/one_half_last] అని మనం ఆలోచిస్తే, బైబిల్ దీనిని సమర్ధన లేదా నీతిమంతునిగా తీర్చబడుట అని పిలుస్తుంది. #doctrineofJustification “నీతిమంతునిగా తీర్చబడుట” అనేది బైబిల్ సువార్త యొక్క ముఖ్య అంశముగా ఉంది. బైబిల్ మరి ఈ “నీతిమంతునిగా తీర్చబడుట” గురించి ఏమి చెబుతుందో పరిశీలిద్దాం. యేసుక్రీస్తుతో విశ్వాసికి ఉన్న సంబంధాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది; ఇది ఒక ముఖ్యమైన క్రైస్తవ సిద్ధాంతం. “తీర్పు తీర్చుట” అనునవి దేవుని వశములో ఉన్నాయి, అవి దేవుని చర్యలు. ఆయన పాపిని నీతిమంతునిగా తీర్చడం అనేది,చట్టబద్ధమైన ప్రకటన; దీనిలో దేవుడు,ఒక పాపి యొక్క పాపాలన్నిటిని క్షమించి, అతన్ని తన దృష్టిలో నీతిమంతునిగా అంగీకరిస్తాడు మరియు లెక్కిస్తాడు. పాపి, యేసుక్రీస్తుపై నమ్మకం ఉంచిన క్షణంలోనే, దేవుడు పాపిని నీతిమంతుడిగా ప్రకటిస్తాడు. దేవుడు కేవలము మన ప్రతినిధి, అయిన యేసు క్రీస్తు ప్రభువు యొక్క విధేయత, ఆయన పొందిన మరణమును బట్టి మనలను నీతిమంతులుగా తీర్చబడతాము అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది.

“ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై,నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను”. రోమీయులకు 3:21-26

ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునిపట్ల చూపించిన విధేయతను ఆధారము చేసుకుని దేవుడు పాపులను నీతిమంతులుగా ప్రకటిస్తున్నాడు ; మన పాపములు యేసు ప్రభువునకు ఆపాదించబడినవి;

“నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.
మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నాకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.”. యెషయా గ్రంథము 53:4,5,6,11

దీనంతటి ప్రకారం, ఆయనను విశ్వసించే ప్రతీపాపియొక్క పాపాలకూ బదులుగా ఏపాపమూ చేయని యేసుక్రీస్తుకు శిక్షవిధించబడింది, ఏ నీతిలేని మనకి ఆయన నీతి ఆపాదించబడినది. “నీతిమంతునిగా తీర్చబడుట” అనగా దేవుడు పాపులను నీతిమంతులుగా ప్రకటించుట. “నీతిమంతునిగా తీర్చబడుట” అనగా ప్రతి విశ్వాసి పూర్తిగా దేవునియొక్క శిక్ష నుండి ,కోపము నుండి విడిపించబడటం. ఇది కేవలం దేవుని కృప ద్వారానే మనకి కలిగినది. కాబట్టి అతిశయకారణ మెక్కడ? #doctrineofJustification

Author
Isaac

Further reading

పాపం అంటే ఏంటి?

పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి.

EP 01 : Introduction

Welcome to life and Scripture: Discovering God’s truth for everyday living. Welcome to the very first episode of Life and Scripture ! I’m...