Home » మాట్లాడే దేవుడు

మాట్లాడే దేవుడు

దేవుని స్వరాన్ని వినడం: సమూయేలు అనుభవం
1 సమూయేలు 3:10

“తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలూ సమూయేలూ, అని పిలువగా సమూయేలునీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను.”
1 సమూయేలు 3:10

దేవుని ప్రత్యక్షతకు ఆకాంక్ష

ఈ రోజుల్లో కూడా దేవుడు ప్రత్యక్షమై మనతో మాట్లాడితే ఎంత బాగుంటుందో కదా? కొంతమంది, “దేవుడు నాకు ఇలా చెప్పాడు,” అని అంటుంటారు. కానీ వాస్తవానికి, అవన్నీ వారి మనస్సులో కలిగిన భావాలు మాత్రమే అవుతాయి.

ఆ రోజుల్లో దేవుని వాక్యము అరుదుగా ఉండేది. అందువల్ల, దేవుడు అసాధారణ రీతిలో సమూయేలుతో మాట్లాడాడు. ఆ పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. మీరు చిన్నవయసులో మీ తల్లిదండ్రులను వదిలి ఏలీ దగ్గర పరిచారకునిగా ఉన్నారు. ఏలీ కుమారులు హొఫ్నీ, ఫీనెహాసులు ఘోరమైన పనులు చేస్తుంటే, వాటిని చూసి మీరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు.

ఒక రాత్రి, గాఢ నిద్రలో దేవుడు పిలిచినప్పుడు, మీరు ఎలా స్పందించేవారు? ఏలీ పిలిచారనుకుని మూడుసార్లు ఆయన్ని కలవడానికి వెళ్లిన తర్వాతే, దేవుడు పిలుస్తున్నారని అర్థమైంది.

యేసు క్రీస్తు ద్వారా దేవుని స్వరాన్ని వినడం

“పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు,
ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.”

హెబ్రీ 1:1-2

ఆ రోజుల్లో దేవుని వాక్యము అరుదుగా ఉండడం వలన అసాధారణ రీతిలో సమూయేలుతో ఆయన మాట్లాడారు. కానీ ఈ రోజున, దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతాడని వాక్యము చెప్తుంది. 1 సమూయేలు 3:7 లో చూడగలుగుతాము:
“సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంక ప్రత్యక్షము కాలేదు.”

అలాగే మనం కూడా, దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం ద్వారా దేవుని అనుభవం పొందగలుగుతాము.

ఈరోజు దేవుని వాక్యము మనకు పుష్కలంగా లభిస్తుంది

దేవుడు తన రక్షణ సంకల్పాన్ని, తన చిత్తాన్ని మనకు బైబిల్లోని 66 పుస్తకాల ద్వారా స్పష్టంగా తెలియజేశాడు. అనుభవాలు, హృదయాలోచనలు, కలలు ఇవన్నింటి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు.
“వాక్యము సత్యము గనుక అది మనలను ఎప్పుడు సత్యము వైపే తీసుకొనివెళ్తుంది.”

కాబట్టి, బైబిల్ చదవడం, ధ్యానం చేయడం, మరియు విధేయత చూపడం చాలా ముఖ్యమైందని గుర్తించాలి:

  • “యెహోవా ధర్మశాస్త్రము యందు తనకు ఇష్టం ఉండి, రాత్రింబగలు ఆ ధర్మశాస్త్రమును ధ్యానించు వాడు ధన్యుడు.”
    కీర్తనలు 1:2
  • “కాబట్టి విశ్వాసము విన్నవాటివలన వచ్చును, వినుట క్రీస్తు వాక్యమునందు వచ్చును.”
    రోమా 10:17

ముగింపు

ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాడు, కానీ అది వాక్యము ద్వారానే. మనం వాక్యానికి విధేయతతో జీవించడమే దేవుని స్వరాన్ని వినగలిగే మార్గం. దేవుని వాక్యాన్ని మన జీవితంలో ప్రతిరోజూ ప్రథమ స్థానంలో ఉంచుదాం.

Author
Isaac

Isaac is the creator and host of the Life & Scripture podcast, where he passionately helps people follow Christ and simplifies theology to make it practical for everyday living. A software engineer by profession, Isaac combines his analytical mindset with a heart for faith and discipleship.

He is married to his wonderful wife, Kanthi, and is a proud father of three energetic boys. Alongside his career, Isaac is a biblical counselor in training, an avid reader, and a skilled keyboard player with a deep love for music and worship.

Through his blog and podcast, Isaac shares reflections, insights, and encouragement for living a Christ-centered life, inspiring others to integrate faith into every aspect of their journey.

Further reading

దేవుని మహిమా? మీ స్వంత కీర్తియా?

ఈ రోజుల్లో, మనల్ని మనం గొప్పగా చెప్పుకోవడం చాలా సాధారణమైపోయింది. సోషల్ మీడియాలో చూస్తే, చాలామంది తమ టాలెంట్స్, సాధించిన విజయాలు, తమ నమ్మకాలు...

క్రొత్తగా తిరిగి జన్మించబడడం: నిజమైన మార్పునకు పునాది

క్రొత్తగా తిరిగి జన్మించబడడం అనేది క్రైస్తవ జీవితానికి మూల రాయి. ఇది విశ్వాసి యొక్క స్వభావ మార్పును, పవిత్రతను, మరియు దేవునికి విధేయతను సూచిస్తుంది.