Home » నీ జీవితాన్ని వృధా చేసుకోకు

నీ జీవితాన్ని వృధా చేసుకోకు

ఈరోజు బాధ పడాల్సిన విషయం ఏంటో తెలుసా?

మీలో చాలా మంది ఈ లోకాన్ని ప్రభావితం చెయ్యడానికి ముందుకు రావట్లేదు. అందరూ మిమ్మల్ని ఇష్టపడాలని కోరుకొంటున్నారు… బాగా చదువుకొని, మంచి ఉద్యోగం సంపాదించుకొని, ఒక మంచి భర్తనో, భార్యనో సంపాదించుకొని, ఒక మంచి ఇల్లు కట్టుకొని, వీలుంటే ఒక మంచి కారు కొనుక్కొని, వీకెండ్స్ ని బాగా ఎంజొయ్ చేస్తూ, అప్పుడప్పుడు హాలిడేకి వెళ్తూ, మంచి ఆరోగ్యవంతమైన, సుదీర్ఘమైన జీవితం జీవించి రిటైర్ అవ్వాలని కోరుకొంటున్నారు. ఏ కష్టం లేని చావు పొందుకొని, చివరికి నరకాన్ని తప్పించు కోవటమే మీ జీవిత ధ్యేయం. నిత్యత్వంలో ఈ భూమి మీద జీవించిన జీవితం లెక్కలోనికి వస్తుందని మీకు అర్థంకావడం లేదు. ఇదే రేప్పొద్దున్న దారుణమైన జీవితానికి దారితీస్తుంది.

మూడు వారల క్రితం మాకు రూబి ఎలయాసన్, లారా ఎడ్వార్డ్స్ ఇద్దరు చనిపోయినట్లు మా సంఘానికి వార్త వచ్చింది. రూబి ఎలయాసన్ కి 80 సంవత్సరాలకు పైగానే. ఆమే వివాహం చేసుకోలేదు. ఆమె ఒక నర్సు. బాగా కఠినమైన ప్రదేశాల్లో, నిరుపేదల మధ్య యేసు క్రీస్తు గురించి చెబుతూ తన జీవితాన్నంతా ధారపోసింది. లారా ఎడ్వార్డ్స్ – ఆమె వయసు కూడా 80 సంవత్సరాలకు పైగానే, ట్విన్ సిటీస్ లో ఒక మెడికల్ డాక్టర్, రిటైర్ అయ్యిన తరువాత రూబీతో కలిసి కామెరూన్ దేశంలో పల్లె పల్లెకు తిరుగుతూ పేదలకు పరిచర్య చేసింది. వారు కార్లో వెళ్తుండగా, బ్రేకులు ఫైయిల్ అయ్యాయి. కొండ మీద నుండి కారు కింద పడిపోయింది. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. అది విని, నేను మా సంఘంతో ఏమన్నానో తెలుసా? ‘ఇది దారుణం కానే కాదు, ఇది విషాదం కానే కాదు’ అని అన్నాను.

అసలైన దారుణం ఏంటో నేను చెబుతాను వినండి…

బాబ్, పెన్నీ తొందరగానే రిటైర్ అయ్యారు… అతనికి 59, ఆమేకు 51. ఇప్పుడు వాళ్లు ఫ్లోరిడాలో ఉంటున్నారు. వారి 30 అడుగుల మోటార్ పడవలో క్రూజింగ్ చేస్తున్నారు. సాఫ్ట్ బాల్ ఆడుతూ, సముద్రపు పెంకుల్ని ఏరుకొంటున్నారట. అది దారుణం అంటే. అది విషాదమైన జీవితం అంటే! నీ జీవితంలో చివరి దినాన, దేవుని ఎదుట నీవు నిల్చున్నప్పుడు ఏం చెప్తావు? ‘ఇదిగో దేవా! చూడు నేను ఏరుకొన్న సముద్రపు పెంకుల్ని చూడు’ అని చెబుతావా? నా పడవని చూడు అంటావా? నో… నీ జీవితాన్ని వృధా చేసుకోకు.

– జాన్ పైపర్ (Original Author)

– Translated by Samuel Boppuri

Pastor at Reformed Baptist Church, Vinukonda.

Further reading

Ancient path leading to a cross symbolizing the true way in Christ, fulfilling God’s covenant with Abraham

ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే మార్గము

నేను మా పితరుల దేవునిని మార్గము చొప్పున సేవించుచున్నాను - అపొస్తలుల కార్యములు 24:14 అపొస్తలుడైన పౌలు ఒకసారి కైసరయలో ఉన్న అధికారుల యెదుట నిలబడి ఇలా...

దేవుని మహిమా? మీ స్వంత కీర్తియా?

ఈ రోజుల్లో, మనల్ని మనం గొప్పగా చెప్పుకోవడం చాలా సాధారణమైపోయింది. సోషల్ మీడియాలో చూస్తే, చాలామంది తమ టాలెంట్స్, సాధించిన విజయాలు, తమ నమ్మకాలు...

క్రొత్తగా తిరిగి జన్మించబడడం: నిజమైన మార్పునకు పునాది

క్రొత్తగా తిరిగి జన్మించబడడం అనేది క్రైస్తవ జీవితానికి మూల రాయి. ఇది విశ్వాసి యొక్క స్వభావ మార్పును, పవిత్రతను, మరియు దేవునికి విధేయతను సూచిస్తుంది.