Home » క్రైస్తవుడు క్షమించరాని పాపానికి పాల్పడగలడా?

క్రైస్తవుడు క్షమించరాని పాపానికి పాల్పడగలడా?

క్షమించరాని పాపం గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? నేను క్షమించరాని పాపం చేసానా ? అన్న మీకు సందేహం కలిగితే, ఏ ఆర్టికల్ లో మీకు జవాబు దొరుకుతుంది.

మత్తయి 12:23, లో యేసు దెయ్యము పట్టిన ఒకనిని స్వస్థపరిచినప్పుడు, అక్కడ ఉన్న ప్రజలు ఈయన దావీదు కుమారుడు కదా? అని మాట్లాడుకుంటుంటే, క్రీస్తుతో ఉన్న పరిసయ్యులు ఆ మాటలు విని వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు అని అంటారు. అప్పుడు యేసు, వారి దుర్బోధను సరిచేస్తూ సమాధానం ఇచ్చే సందర్భంలో , మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు అని చెప్తాడు.

మనము ఈ వచనాన్ని చదివినప్పుడు, ఈ పాపక్షమాపణ లేని పాపం చేసివుంటామా? అన్న సందేహం రావచ్చు. అలా ప్రశ్నించుకోవడం మంచిదే, కానీ దానికి సమాధానం ఏమిటి? అసలు పరిశుద్ధాత్మకు విరోధముగా చేసే పాపాలు ఎలా ఉంటాయి. ఆ పాపాలతో , మనకి తెలిసిన పాపాలకి (1 కొరింథీ 6:9–10) వ్యత్యాసం ఏమిటి ? “పరిశుద్ధాత్మకు విరోధముగా చేసే పాపం” అంటే ఏంటో అవాహయాన లేకపోతే ఎప్పటికి మనము అనిశ్చితస్థితి (అయోమయ స్థితి)లో ఉండిపోతాము. ఒకవేళ మనం ఆ పాపాన్ని చేసిఉంటే ఎలా? దేవుడు నా పాపాన్ని క్షమించనని చెప్పాడు కదా ! నేను క్షమించబడ్డానా ? అని మన రక్షణ మీద మనకి అనుమానం రావొచ్చు.

“పరిశుద్ధాత్మకు విరోధముగా చేసే పాపం” అంటే ఏంటో చాల మందికి ఉన్న కొన్ని అపోహలు చూద్దాం.

మన మనస్సు చాలా సృజనాత్మకమైనది, దాని ఆలోచనలకి పరిమితి ఉండదు. అది ఎక్కడికైనా వెళ్లి మమ్మల్ని దారితప్పించగలదు. త్రికైక దేవునిలో పరిశుద్దాత్మ పాత్రని సరిగ్గా అర్ధం చేసుకోకపోవడం, పరిశుద్దాత్మ సహాయంతో స్వస్థతలు చేస్తున్న పాస్టర్ల కార్యాలు మీద నమ్మకం ఉంచకపోవడం, ఇలాంటివి “పరిశుద్ధాత్మకు విరోధముగా చేసే పాపం” అనుకునే ప్రమాదం ఉంది. కనే కాదు.

“క్షమించరాని” పాపం పరిశుద్ధాత్మ కార్యాన్ని బహిరంగంగా దైవదూషణ చేస్తూ తిరస్కరించడం. పరిశుద్దాత్మ క్రియలను సాతాను క్రియలుగా ఆపాదించి దైవదూషణ చేయడం. సత్యాన్ని ఎరిగి కూడా అంతము వరకు హృదయాన్ని కఠినపరచుకొని దేవుడిని తిరస్కరించడం. మత్తయి 12:32లో పరిసేయ్యులు అదే పని చేసారు. వారు ధర్మశాత్రాన్ని ఎరిగిన వారు, వారు ప్రత్యక్షంగా చూసిన ఆశ్యర్యకర్యలు ఒకటి, రెండు కాదు. అయినా, వారు యేసు క్రీస్తుని తిరస్కరించారు. పరిశుద్దాత్మ ద్వారా యేసు క్రీస్తు చేసిన కార్యాలని బయెల్జెబూలుకి ఆపాదించారు. ఇది దేవుని దృష్టిలో క్షమించరాని నేరము. అందుకే యేసు వారికీ కఠినమైన హెచ్చరిక ఇచ్చాడు. మనుష్యకుమారుడిని మీరు దూషణ చేసిన క్షమాపణ ఉంది కానీ, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడితే ఎప్పటికి క్షమాపణ ఉండదు జాగ్రత్త ! అని చెప్పాడు .

ఒక క్రైస్తవుడు ఈ పాపానికి పాల్పడలేడు ఎందుకంటే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తుంది.
మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. రోమా 8:16

పరిశుద్దాత్మ మనకి రక్షణ నిశ్చయతను ఇస్తుంది. అంతే కాదు మనము క్రీస్తు మీద విశ్యాసముంచినపుడు మనలో పరిశుద్దాత్మ నివసిస్తాడు.

మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అపొస్తలుల కార్యములు 2:38.

మరియు మీరు కుమారులై యున్నందుననాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. గలతీయలు 4:6.

కనుక, పరిశుద్దాత్మ తనకు తానే దైవదూషణ చేసుకోవడం అసంభవం. క్రైస్తవుడు “క్క్షమించారని” పాపం” నుండి విముక్తి పొందాడు ఎందుకంటే, మనలని రక్షించుకున్న దేవుడు, చివరి వరకు మనలను ఈ పాపం నుండి కాపాడుతాను అని వాగ్దానం చేసాడు, అందును బట్టి యుగ యుగములకు దేవునికే మహిమ, ఘనత.

తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,
25 మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్య మును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వ మును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక. యూదా 24-25.

మనము “క్షమించరాని పాపం” చేశామని ఒక సందేహం మనలో కలుగుతుంది అంటే, మనము పాపాన్ని తీవ్రంగా పరిగణిస్తాము అని. ఇంకా మనము క్రైస్తవులము అని నిర్దర్చించుకోవడానికి ఒక గుర్తు. ఎందుకంటే, “క్షమించరాని పాపం” చేసేవాడికి ఈ సందేహము రాదు. వచ్చినా వాడి హృదయము కాఠిన్యముచే నింపబడినది కాబట్టి వానికి అభ్యన్తరం ఉండదు. కనుక ఒక క్రైస్తవుడు ఈ పాపానికి పాల్పడగలడు అనే ఆలోచన క్రీస్తు కార్యాన్ని మరియు పరిశుద్ధుల పరిరక్షణ గురించి దేవునివాక్యంలో మనకు వెల్లడైన సత్యానికి దూరంగా ఉంది.

Author
Isaac

Further reading

పాపం అంటే ఏంటి?

పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి.