బైబిల్ ఒక్కటే దేవుని వాక్యమా? వేదాల సంగతి ఏంటి?

ఇటీవల మన తెలుగు క్రైస్తవ సమాజం లో క్రైస్తవులుగా పిలవబడే వారు చేసే వ్యాఖ్యల ద్వారా బైబిల్ యొక్క అధికారిత్వాన్ని ప్రశ్నించేలా చేస్తున్నాయి. క్రీస్తు వేదాలని రాయించాడని , క్రీస్తు వేదాలలో ఉన్నాడని చేసే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇది సమాజానికి ముప్పు మాత్రమే కాదు, దేవుని పట్ల చేసే అపరాధం. ఇది బైబిల్ గ్రంథం యొక్క అధికారంపై చేసే దాడి. ఈ తప్పుడు సిద్ధాంతాన్ని ఎదుర్కోవటానికి బైబిల్ యొక్క లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. దేవుని అధికారిక వాక్యంగా ఉండటానికి అంతర్లీనంగా ఉన్న గ్రంథంలోని మూడు లక్షణాలను పరిశీలిద్దాము. దానిలో ఒకదాన్ని ఈ బ్లాగ్ లో చర్చిద్దాం.

ప్రతిలేఖనము దైవావేశమువలన కలిగినది.

“దైవావేశము” అన్న పదానికి లోతైన అర్ధాన్ని తెలుసుకోనే ప్రయత్నం చేసే ముందు, దాని నిర్వచనాన్ని చూద్దాం. దేవుడు తన వాక్యాన్ని మనకి ఏ విధంగా ఇచ్చాడో అన్న దానిని వివరించేది దైవావేశన .అది ఒక వాహనం లాంటిది. ఇక్కడ అపోస్తులుడైన పౌలు 2 తిమోతి 3:16 లో తిమోతిని అభినందిస్తూ (2 తిమోతి 3:1-10) , తాను నేర్చుకొని రూఢియని నమ్మిన వాక్యములో నిలకడగా ఉండమని హెచ్చరిస్తూ , వాక్యానికి గల శక్తిని, ప్రయోజనాన్ని ,మూలాన్ని వివరిస్తున్న సందర్భం లో పలికిన మాటలివి. ఇక్కడ వాడిన “దైవావేశము”వలన అన్న పదానికి ప్రత్యేకమైన అర్ధం ఉంది. అక్కడ వాడిన గ్రీకు పదం మరి ఎక్కడ బైబిల్ లో వాడబడలేదు. దాని అర్ధము ,”దేవుని ఊపిరి”. దేవుడు తనంతటతానుగా ఇచ్చిన మాటలు అని చెప్పే ప్రయత్నంలో వాడిన పదం. దానిని సులువుగా అర్థంచేసుకోవాలంటే “దైవప్రేరణ” అని చెప్పవచ్చు.

[one_half]”మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు?”, “మీ ప్రేరణ ఏమిటి?” అన్న ప్రశ్నలు మనము వింటూనే ఉంటాము లేదా మనల్నిఎవరైనా అడిగిఉండొచ్చు. మంచి పాటలు రాసినప్పుడు వెనుక ప్రేరేపణ ఉంటుంది. ఒక అద్భుతమైన పెయింటింగ్ వెనుక ఒక ప్రేరణ ఉంటుంది. ఒక మనిషి మరొక మనిషిని ప్రేరేపించవచ్చు.అయితే, వాక్యము దైవావేశము లేదా దైవప్రేరణ అన్నపుడు మనము పైన చెప్పిన విషయాలను బట్టి వచ్చే అర్ధం తీసుకుంటాము. కానీ మనిషి పొందే ప్రేరణ , దైవికమైన ప్రేరణ ప్రమాణము వేరు . దైవ ప్రేరణ  అత్యున్నతమైనది. దానికి పరిధులు ఉండవు. దేవుడు ఎవరిచేత ప్రేరణ పొందేవాడు కాదు.[/one_half][one_half_last][quote] వేదాలను క్రీస్తు రాయించే ఉంటాడు కానీ, బైబిల్ లో ఉన్న క్రీస్తు , వేదాలలో ఉన్న క్రీస్తు మాత్రం వేరువేరు.[/quote][/one_half_last]

సంఘ చరిత్రలో “దైవావేశము ” అన్న నిర్వచనాన్ని వక్రీకరించే ప్రయత్నం కూడా జరిగింది. బైబిల్ ని దేవుడు రాయించాడు అన్న విషయాన్నీ అంగీకరించినా , అది మనకి దేవుడు ఏ విధంగా ఇచ్చాడో అన్న విషయం పై చాల వాదనలు వాదనలు వచ్చాయి .దానికలో కొన్ని చూద్దాం. దేవుడు తనంతటి తానుగ బైబిల్ మొత్తాన్ని చెప్పితే(డిక్టేషన్) బైబిల్ రచయితలు రాసారని ఒక వాదన ఉంది. వారి వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొని ఒక బ్రాంతిలో ఉండి రాసారనే వాదన కూడా ఉంది . మరొక వాదన ఏంటంటే , దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడిన మాటల వరకే దేవుని వాక్యం, మిగితాది దేవుని వాక్యం కాదు అన్న వాదనలు కూడా సంఘ చరిత్రలో మనము చూస్తాం . అయితే క్రైస్తవ వేదాంతవేత్తలు, క్రైస్తవ చరిత్రకారులు మరియు ఆదిమ క్రైస్తవులు ఈ వాదనని సంకోచం లేకుండా కొట్టిపారేశారు. దేవుడు తన వాక్యాన్ని డిక్టేషన్ ద్వారా ఇవ్వలేదన్న ఖచ్చితమైన నిర్ధారన కు వచ్చారు. దేవుడు తన సందేశాన్ని ఇవ్వడానికి రచయిత యొక్క ప్రతిభ, శైలి, వ్యక్తిత్వం, వృత్తి, పదజాలం లేదా వ్యాకరణాన్ని భర్తీ చేయలేదు. పరిశుద్దాత్మ దేవుడు అసంపూర్ణమైన మనుషుల ద్వారా తన సంపూర్ణమైన సత్యాన్ని మనకు తెలియ పరచాడు.( 1 కొరింథీ 2:10-13) ఈ సత్యము క్రైస్తవ విశ్వాస జీవితానికి నాంది.

2 తిమోతి 3:1-10 వాక్యభాగంలో మనం జాగ్రత్తగా గమనించినప్పుడు, పౌలు రెండుసార్లు “లేఖనములు” అని ప్రస్తావించాడు ( 2 తిమోతి 3:15, 2 తిమోతి 3:16). మొదటిదిసారి “పాత నిబంధన”ను గూర్చి చెప్పాడు, రెండొవ సారి , పాత నిబంధనను మరియి క్రొత్తనిబంధనను దృష్టిలో ఉంచుకొని చెప్పాడు(ప్రతి లేఖనము). అంటే ఆదికాండము నుండి ప్రకటన వరకు అంత దైవవాక్యమే అనడానికి కచ్చితమైన నిర్ధారణ.

మరి వేదాలు సంగతి ఏమిటి?

యేసు క్రీస్తు ప్రభువు , పౌలు, మరియు బైబిల్ రచయితలు ఎన్నడూ వేదాల గురించి కాని , వాటిలోనుండి ఒక్క వాక్యాన్నిగాని వారి బోధ లో ఎప్పుడూ పేర్కొనలేదు, ప్రస్తావించలేదు. ఒక పుస్తకాన్ని కానీ, గ్రంధాన్ని కానీ దైవ వాక్యంగా పరిగణించడానికి, ఆమోదించాడనికి ఇది ఒక ముఖ్యమైన నియమము. అందుకే కాథోలిక్స్ పరిశుద్ధ గ్రంధాలుగా పరిగణించే టోబిట్, మాకేబీస్,మరి కొన్ని గ్రంధాలు ప్రొటెస్టెంట్ బైబిల్ లో చోటుచేసుకోలేక పోడానికి ఇది ఒక కారణం.
బైబిల్ అంతాకూడా ఒకే కథనం . ఆదికాండము నుంచి ప్రకటన వరకు రక్షకుడైన యేసును సూచిస్తుంది కానీ వేదాలు అనేకమంది దేవ -దేవతలను పరిచయం చేస్తుంది, వాటిలో ఎక్కువ భాగం తుఫానులు, అగ్ని మరియు గాలి వంటి సహజ శక్తులకు సంబంధించినవి.ఇది దేవుని మొదటి ఆజ్ఞకు స్పష్టమైన ఉల్లంఘన.

వేదాలు , బైబిల్ కి విరుద్ధం.

శ్రీశ్రీ ఒక సమావేశం లో వేదాల గురించి ఇలా అన్నారు, “ఒక సత్యానికి చాలా మార్గాలు ఉన్నాయని వేద జ్ఞానం చెబుతుంది.ఇది ఒక్కటే మార్గం మరియు మీరు దీనిని పాటించకపోతే, మీరు నరకానికి వెళతారు అని ఇది ఎప్పుడూ చెప్పదు, ఒకే ఒక్క సత్యం, ఒక కాంతి, ఒక దైవత్వం మాత్రమే ఉన్నాయని, కానీ అనేక పేర్లు, అనేక రూపాలు మరియు ఆరాధనకు అనేక మార్గాలు ఉన్నాయని ఇది చెప్పింది.” కానీ, బైబిల్ లో యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు(యోహాను 14:6), ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు, లేనివాడికి నరకశిక్ష ఉంటుంది అని చెప్పాడు. ఇది ఎలా సాధ్యం?వేదాలు దేవుడు రాయించి ఉంటే రెండు ఒకదానికి ఒకటి విరుద్దంగా ఎందుకు ఉంటాయి?దేవుడు తన ఆజ్ఞలను తానే ఎందుకు ఉల్లంగిస్తాడు ? బైబిల్, క్రీస్తు ద్వారానే మనకి రక్షణ అని బోధిస్తుంటే, వేదాలు క్రియల ద్వారా రక్షణ లభిస్తుంది అని బోధిస్థాయి. యేసు వేదాలను రచించి ఉంటే రెండు ఒకటే బోధించాలి కదా.? .ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి.

వేదాలని క్రీస్తు వ్రాయించాడు అన్నది ఒక వితంతవాదమే తప్ప దానిలో సత్యము కానీ చారిత్రక ఆధారము ఎక్కడా లేవు. వేదాలను క్రీస్తు రాయించే ఉంటాడు కానీ, బైబిల్ లో ఉన్న క్రీస్తు , వేదాలలో ఉన్న క్రీస్తు మాత్రం వేరువేరు. వేదాలలో క్రీస్తు తికమకపెట్టే వాడు, కానీ బైబిల్ లో ఉన్న క్రీస్తు పరిశుద్ధుడు. ఆయనే సత్యము,జీవము, మార్గమై ఉన్నాడు. వాక్యాన్ని సరిగా వ్యాఖ్యానించక పోతే వచ్చే తిప్పలే ఇలాంటి వ్యాఖ్యలకి కారణం .

కోరం డియో

దేవుని వాక్యం మానవాళికి దేవుని ఇచ్చిన వరం. అది ధ్యానించడం ఎంతో అవసరం. పౌలు ఎఫెసీయులకు వివరించినట్లుగా, మనం పసిపిల్లలమై ఉండకుండా ప్రభువైన యేసుక్రీస్తు పరిపక్వతలో మనమన్ని విషయములలో ఎదుగునట్లు దేవుడు మనకు సహాయపడమని వేడుదాం. (ఎఫెసీ 4:14)

Author
Isaac

Further reading

పాపం అంటే ఏంటి?

పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి.

EP 01 : Introduction

Welcome to life and Scripture: Discovering God’s truth for everyday living. Welcome to the very first episode of Life and Scripture ! I’m...