1. పోప్ సంఘానికి శిరస్సు
యేసు, పేతురు ( ఈ పేరుకి అర్దం రాయి)అనబడు సీమోను ని సంఘానికి “రాయి”గ చేసాడని, పరలోక తాలపుచెవులు ఇచ్చాడని, సంఘమంతటికి కాపరి గా నియమించ్చాడని కాథలిక్కుల ప్రగాడ విశ్వాసం. ప్రస్థుతం పేతురు మరియు అపొస్తలుల కాపరిత్వాన్ని బిషప్పులు పోప్ యొక్క అధికారం క్రింద కొనసాగిస్తున్నారు.ఈ అభిప్రాయానికి మూలము Matthew 16:18-19. ఈ ఒక్క వచనాలని నేను చదివినప్పుడు వారు నమ్మింది నిజమే అనుకున్నాను.దానిని సందర్భం తెలియకుండ చదివిన ఎవరికైనా అలాగె అనిపిస్తుంది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ అభిప్రాయాలని లేఖనములు ఏకీభవిస్తున్నాయా? ఈ ప్రశ్నకు జవాబు Acts 15:1-23, Galatians 2:1–14 లో పరిశీలిస్తే కనిపిస్తుంది. అపొస్తలులు అందరూ క్రీస్తు ఇచ్చిన అధికారంతో సమానంగా సువార్త పరిచర్యలో పాలుపంపులు చేసారని తెలుస్తున్నది. 1 Peter 5:1–5 “తోటిపెద్దను, క్రీస్తు శ్రమలనుగూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను” అని రాశాడు. ఆయన తనను ముఖ్యునిగా కాకుండ మిగిలిన వారితో పాటు తోటి పెద్దగా భావిస్తారు.ప్రారంభంలో పేతురు సువార్త వ్యాప్తిలో ముఖ్యునిగా ఉండినను సందర్భొచితంగ గమనిస్తె ఇతర అపొస్తలులపై లేదా చర్చిపై అతను సర్వాధికారం కలిగి ఉన్నాడని మనకి ఎక్కడా చెప్పబడదు.
2. కాథలిక్కులు తల్లియైన మరియను ఆరాధించడం
దేవునికి మాత్రమే ఆరాధన చెల్లించాలని ,ఆయన ఆరాధనకు పాత్రుడు అని కాథలిక్కులు విశ్వసిస్థారు. కాని వారు మరియను కూడ ఆరాధిస్తారు.ఒక్కమాటలో చెప్పాలంటె ఆమె దేవుని తల్లి అని గొప్ప భక్తి శ్రధలతో గౌరవిస్తారు. మదర్ థెరీసా ఒకసారి జీవాహారమైన క్రీస్తు ను పొందుటకు స్వఛ్చమైన హృదయాన్ని ఇవ్వమని మేరి ని వేడుకున్నది అని కాథలిక్ మూలాలు చెపుతున్నాయి.ఈ రకమైన ప్రార్థన గురించి బైబిల్ ఏమి చెప్తుంది? బైబిల్ లో ఇటువంటి ప్రార్థనలు ఎవ్వరు ఎప్పుడూ ప్రస్తావించడం కాని ప్రోత్సాహించడం కాని జరగలేదు. కాథలిక్కులు యేసు యొక్క ప్రధానయాజకత్వాన్ని మేరికి ఆపాదిస్తునారు.మరియమ్మకు కలిగిన హృదయము, దీనత్వాన్ని కోరుటలో తప్పు ఏమీ లేదు, కానీ యేసు ద్వారా కాక ఆమెకు ప్రార్థించుట దేవుని పట్ల అపరాధం.
[one_half] 1 Tim 2:5 లో “దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు” అని రాయబడి ఉంది. పరిశుద్ధులకు ప్రార్థించడం లేఖనములకు విరుద్దం, ఎందుకంటే మనం వారిని దేవునికి మరియు మనుషులకు మధ్యవర్తులను చేస్తు యేసుక్రీస్తు యొక్క ఏకైక మధ్యవర్తిత్వాన్ని క్షీణంపచెస్తున్నాము. యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యం, ప్రత్యేకంగ అయన చేసిన పరిపూర్ణ బలి ప్రభావము గూర్చి మరియు తండ్రి కుడిపార్శ్వమున కుర్చొని తనికి అనుగ్రహించబడిన ప్రజల కోసము విజ్ఞాపన గూర్చి హెబ్రీ పత్రికలో అంతట చూస్తాము.ఇంకా చెప్పాలంటే మన ప్రార్ధనలు కూడ యేసు నామము లోనే కదా తండ్రి దగ్గరకు తెస్తాము. ఆలోచించండి. ఆరాధన దేవునికి మాత్రమే చెందాలి అన్నప్పుడు అది యేసుక్రీస్తు ద్వారానే. ఇది వాక్యానుసారం.[/one_half] [one_half_last][quote] ఎన్ని అర్పణలు చేసినా మన పాపమునకు వచ్చు జీతమైన మరణము నుండి తప్పించుకొవడం అసాధ్యం. క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే పాప క్షమాపణ ,విమొచన లభిస్తుంది.[/quote][/one_half_last]3. కాథలిక్కులు పాపపరిహార పత్రాలను నమ్ముతారు
కాథలిక్ సిద్ధాంతం పాపం కారణంగా వచ్చు తాత్కాలిక శిక్షను తగ్గించడానికి లేదా తొలగించడానికి మార్గం ఉందని బోధిస్తుంది. అదే పాపపరిహార పత్రాల మార్గం.ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటె కాథలిక్ చర్చి బోధించే పాపం యొక్క ద్వంద్వ స్వభావాన్ని గురించి తెలుసుకోవాలి.ఒకటి మరణకరమైన పాపం రెండొవది క్షమించ దగిన పాపం. మరణకరమైన పాపములకు మూడు షరతులు అవసరం. ఒకటి, ఘోరమైనదై ఉండాలి,పూర్తి జ్ఞానంతో పాపము చేసి ఉండాలి, మూడొవది, ఎవరి బలవంతము ద్వార ఆ నేరము చేసిఉండకూడదు. ఒకటి లేదా రెండు పరిస్థితులు కలిగిఉన్నట్లైతే క్షమించ దగిన పాపంగ పరిగణిస్తారు. మరణకరమైన పాపం దేవునితో మనకున్న సహవాసాన్ని దూరం చేసి నిత్యత్వానికి వెళ్ళకుండ ఆపుతుంది, ఫలితంగా నరకం లభిస్తుంది , మరొకవైపు క్షమించ దగిన పాపం ఆత్మను బలహీనం చేస్తుందే కానీ కృపను దూరం చేయదు అని బోధిస్తారు. ఏది ఏమైన ఈ రెండు పాపాల ద్వార పాపం మనలను చుట్టుకొని ఉంటుంది కాబట్టీ ఆ పాపాన్ని ఈ లోకములో బ్రతికి ఉన్నప్పుడే కాకుండ మరణించిన తరువాత కూడ శుద్దీకరించుకోవచును. ఈ శుద్దీకరణ తాత్కాలిక శిక్షను తగ్గిస్తుందని వారి బోధ. సాధారణమైన మాటలలో మంచి మానవతా పనిని చేయటం,ఒక ప్రత్యేక ప్రార్థన, లేదా ఒక నిర్దిష్ట స్థలాన్ని సందర్శించడం, తపస్సు ద్వారా తాత్కాలిక శిక్షను తగ్గించవచ్చునని అర్ధం. పాపపరిహార పత్రాలు కాథలిక్ చర్చి ద్వారా లభిస్తాయి. ఇది ఇలా ఉండగా దీనిని గూర్చి లేఖనములు ఎమి బోధిస్తుంది ? దానికి జవాబు ఏమి బోధించుటలేదు. కాథలిక్ చర్చ్ సిద్ధాంతాలు లేఖనాల నుండి కాక సాంప్రదాయం నుండి ఉద్భవించాయి. మన సహజ పాప పరిస్తితి వల్ల దేవుని ఉగ్రతకు పాత్రులమైన మనము ఎన్ని పాపపరిహార పత్రాలను సంపాదించినా, ఎన్ని అర్పణలు చేసినా మన పాపము కి వచ్చు జీతమైన మరణము నుండి తప్పంచుకొవడం అసాధ్యం. క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే పాప క్షమాపణ ,విమొచన లభిస్తుంది. క్రీస్తు తాను ప్రాయశ్చిత్తబలిగా మన పాపములు కప్పుటకు పరిపూర్ణ విధేయతో ప్రతి మనుష్య జాతి కొరకు తండ్రి చిత్తము చొప్పున స్వచ్ఛందగా తన్నుతాను అర్పించుకొనెను(Hebrews 7:27) .
4.కాథలిక్కులు మరణాంతర శుద్ధీకరణను విశ్వసిస్తారు
కాథలిక్ సిద్ధాంతం దేవుని కృప ద్వారా రక్షింపబడినను శుద్ధీకరణ అవసరమని బోధిస్తుంది. ఈ శుద్ధీకరణ భూమిపైనే కాకుండ ఒకరి మరణం తర్వాత కూడా పాప ప్రాయశ్చిత్త స్తలములో జరపవచ్చునని, దీని ద్వార పరలోకానికి ప్రవేశించవచ్చునని నమ్మకం. ఈ భావన లేఖనాల ఆధారంగ కాకుండా మక్కబీయుల గ్రంథ ఆచరణ మీద ఆధారపడి ఉంది. మీరు గమనిస్తే, కాథలిక్కులు మక్కబీస్ గ్రంధాన్ని పవిత్ర గ్రంధంగా పరిగణిస్తారు. ఈ “ప్రాయశ్చిత్త స్తలము” అనేది ఒక విదేశీ భావన, ఇది లేఖనాలకు విరుద్దం. ఈ భావన ను నమ్మినట్లైతే క్రీస్తు సిలువ మరణాన్ని,బలి అర్పణను తిరస్కరించినట్లె. మన పాపం పూర్తిగా క్రీస్తు నీతి,పరిపూర్ణ విధేయత చేత కప్పబడి ఉంది. ఇది సంతోషించదగిన విషయం.
5.విశ్వాసం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడము
విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాము అని ప్రొటెస్టంట్లు నమ్మితే కాథలిక్కులు క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము అని రోమన్ కాథలిక్ చర్చ్ మీద వ్యతిరేకంగా ఉన్న అపవాదులలో ఇదొకటి. వారు,విశ్వాసం నీతిమంతులుగా తీర్చబడుటలో ముఖ్య పాత్ర వహిస్తుందని నమ్మకుండ ఉండరు. కానీ ఈ విషయమై రోమన్ కాథలిక్ గణనలో తీసుకోనిది “సొల” అనె పదము.మార్టిన్ లూథర్ “సోలా ఫిడే” అని ప్రకటన చేసినఅర్దం ఎమిటంటే, విశ్వాసం ప్రాథమిక దశయే కాక నీతిమంతులుగా తీర్చబడుటకు కావలసినది విశ్వాసం మాత్రమే.అపొస్తలుల బోధ కూడా ఇదే.పదహారవ శతాబ్దంలో,ఒకరు నీతిమంతులుగా తీర్చబడుటకు కావలసినది ఏమిటి అన్న అంశము ప్రొటెస్టంట్ సంస్కర్తలకు మరియు రోమన్ కాథలిక్ల వేదాంతులకు మధ్య ఒక సమస్య అయ్యింది.వారు ఈ సమస్య విషయమై ఇప్పటికి అంగీకరించరు.రోమన్ కాథలిక్ చర్చి,బాప్టిజం మరియు భక్తి చర్య(ఉదా:తపస్సు)నీతిమంతులుగా తీర్చబడుటకు మూలము అని నమ్ముతారు. కాని ప్రొటెస్టంట్ సంస్కర్తలకు దృష్టిలో ,క్రీస్తు యొక్క నీతి విశ్వాసి పై ఆపాదించించబడుతుంది అని చెప్తారు. ప్రశ్నఏమిటంటే లేఖనం మనకు ఏమి చెప్తుంది?ఇది వాక్యనుసారమా?నిజానికి మిగిలిన వాటికంటే ఈ సిద్దాంతము సరళమైనది.ఈ సిద్దాంతము గూర్చి బైబిలు అనేక చోట్ల పేర్కొన్నప్పటికి రోమా పత్రిక లో పౌలు తేటగ వివరించడం జరిగింది.”ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు…కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.”(Romans 3:24). పౌలు సిద్ధాంతం అందరూ నిస్సహయంగా ఉన్న పాపులమని అని స్పష్టంగా చూపిస్తుంది. దీనిని బట్టి కేవలం విశ్వాసం ద్వారానే తప్ప, విశ్వాసం మరియు మంచి కార్యాల ద్వార కాదు.కాథలిక్ బోధలోఉన్న అనేకమైన తెడాలలో ఇవి కొన్ని మాత్రమే.
కోరం డియో
క్రీస్తు లో ఉన్నవారు ఈ విషయాలు గురించి అలోచించేటప్పుడు మనల్నిమనమే ప్రశ్నించు కోవలసిన ఒక ప్రశ్న “ఇది వాక్యానుసారమా?” ఈ బోధనలను జాగ్రత్తగా పరిశీలించి వాక్యానుసారమామైనది కాకపోతే, ఈ బోధనల నుండి దూరంగా ఉండాలి.