ఈ రోజు బాధ పడాల్సిన విషయం ఏంటో తెలుసా? మీలో చాలా మంది ఈ లోకాన్ని ప్రభావితం చెయ్యడానికి ముందుకు రావట్లేదు. అందరూ మిమ్మల్ని ఇష్టపడాలని కోరుకొంటున్నారు…బాగా చదువుకొని, మంచి ఉద్యోగం సంపాదించుకొని, ఒక మంచి భర్తనో,భార్యనో సంపాదించుకొని, ఒక మంచి ఇల్లు కట్టుకొని, వీలుంటే ఒక మంచి కారు కొనుక్కొని, వీకెండ్స్ ని బాగా ఎంజొయ్ చేస్తూ, అప్పుడప్పుడు హాలిడేకి వెళ్తూ, మంచి ఆరొగ్యవంతమైన, సుదీర్ఘమైన జీవితం జీవించి రిటైర్ అవ్వాలని కోరుకొంటున్నారు. ఏ కష్టం లేని చావు పొందుకొని, చివరికి నరకాన్ని తప్పించు కోవటమే మీ జీవిత ధ్యేయం. నిత్యత్వంలో ఈ భుమి మీద జీవించిన జీవితం లెక్కలోనికి వస్తుందని మీకు అర్ధంకావడం లేదు. ఇదే రేప్పొద్దున్న దారుణమైన జీవితానికి దారితీస్తుంది.
మూడు వారల క్రితం మాకు రూబి ఎలయాసన్, లారా ఎడ్వార్ద్స్ ఇద్దరు చనిపోయినట్లు మా సంఘానికి వార్త వచ్చింది. రూబి ఎలాయాసన్ కి 80 సంవత్సరాలకు పైగానే. ఆమే వివాహం చేసుకోలేదు. ఆమె ఒక నర్సు. బాగా కఠినమైన ప్రదేశాల్లో, నిరుపేదల మధ్య యేసు క్రీస్తు గురించి చెబుతూ తన జీవితాన్నంతా ధారపోసింది. లారా ఎడ్వార్డ్స్ – ఆమె వయసు కూడా 80 సంవత్సరాలాకు పైగానే, ట్విన్ సిటీస్ లో ఒక మెడికల్ డాక్టర్, రిటైర్ అయ్యిన తరువాత రూబీతో కలిసి కామెరూన్ దేశంలో పల్లె పల్లెకు తిరుగుతూ పేదలకు పరిచర్య చేసింది. వారు కార్లో వెళ్తుండగా, బ్రేకులు ఫైయిల్ అయ్యాయి. కొండ మీద నుండి కారు కింద పడిపోయింది. ఇద్దరూ అక్కడికక్కడే చనిపొయారు. అది విని, నేను మా సంఘంతో ఏమన్నానో తెలుసా? ‘ ఇది దారుణం కానే కాదు, ఇది విషాదం కానే కాదు ‘ అని అన్నాను.
అసలైన దారుణం ఏంటో నేను చెబుతాను వినండి….బాబ్, పెన్నీ తొందరగానే రిటైర్ అయ్యారు…అతనికి 59, ఆమేకు 51. ఇప్పుడు వాళ్ళు ఫ్లోరిడాలో ఉంటున్నారు. వారి 30 అడుగుల మోటార్ పడవలో క్రూజింగ్ చేస్తున్నారు.సాఫ్ట్ బాల్ ఆడుతూ, సముద్రపు పెంకుల్ని ఏరుకొంటున్నారట. అది దారుణం అంటే. అది విషాదమైన జీవితం అంటే!..నీ జీవితంలో చివరి దినాన, దేవుని ఎదుట నీవు నిల్చున్నప్పుడు ఏం చెప్తావు? ఇదిగో దేవా! చూడు నేను ఏరుకొన్న సముద్రపు పెంకుల్ని చూడు అని చెబుతావా? నా పడవని చూడు అంటావా? నో.. నీ జీవితాన్ని వృధా చేసుకోకు.
– జాన్ పైపర్ ( original Author)
– Translated by Samuel Boppuri