Home » నీతి ఆపాదించబడుట

నీతి ఆపాదించబడుట

పౌలు నీతిమంతులుగా తీర్చబడుట అన్న  సిద్ధాంతాన్ని రోమీయులకు వివరిస్తూ, పాత నిబంధన లోని  ఆదికాండము 15 వ అధ్యాయం ఆరవ వచనానికి వెళ్లాడు.
అక్కడ అబ్రాహాము గురించి “అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను” అన్న మాటలు రాయబడినట్లుగా చూస్తాము. పౌలు, ఈ అంశాన్ని  వివరిస్తున్నపుడు,  దేవుడు ఒకరిని ,విశ్వాసం ఆధారంగా మాత్రమే నీతిమంతులుగా లెక్కిస్తున్నాడనీ, కానీ వారి సొంత నీతిని చూసి కాదాని  స్పష్టంగా చెపుతున్నాడు.

ఎప్పుడైతే ఒకరు క్రీస్తుమీద విశ్వాసాన్ని ఉంచుతారో,  ఆ సమయం లోనే   క్రీస్తు యొక్క నీతి ఆ విశ్వాసి జాబితాలోకి  transfer అవుతుంది; అందువల్లనే, మన రక్షణకి ఏకైక పుణ్యకారణం: యేసు తన నీతిని మనకి బదిలీ చేయడం అని నమ్ముతాము. దీనినే ఆపాదించబడుట అంటాము. దీనినే ఇంగ్లీష్ లో “imputation ” అంటాము.

క్రీస్తు , మన పాపానికి జీతంగా, మన బదులు మరణించడమే కాకుండా, తనపై నమ్మకం ఉంచినవారి ధర్మశాస్త్రపరమైన బాధ్యతను కూడా  తన సంపూర్ణ విధేయత ద్వారా పరిపూర్ణమైన జీవితాన్ని ఆయనే జీవించి నెరవేర్చాడు.  ఆపాదించబడుట అన్న అంశానికి ఇది అర్ధం.
ఇది పదహారవ శతాబ్దపు సంస్కరణ(Reformation)  యొక్క ఏకైక, కేంద్ర, అతి ముఖ్యమైన అంశం.

Author
Isaac

Further reading

పాపం అంటే ఏంటి?

పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి.