బైబిల్ ని అర్ధం చేసుకోవాలంటే గందరగోళంగా ఉందా?

దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. 1 కొరింథీ 14:33

కొన్ని వందల సవత్సరాల క్రితం, బైబిల్ గ్రంధం విశ్వాసులందరికీ అందుబాటులో ఉండేది కాదు.
అపోస్తలుల కాలం తరువాత, రోమన్ కేథలిక్ అనే సంస్థవారు దేవుని వాక్యాన్ని తమ చేతుల్లోకి తీసుకొని, ఆ వాక్యం సాధారణ విశ్వాసులకు అర్ధమయ్యేవిధంగా స్పష్టంగా లేదని, దానిని అర్ధం చేసుకోవడం పొప్ మరియూ, కొందరు బిషప్లకే సాధ్యం అని చెపుతూ సామాన్య విశ్వాసులకు బైబిల్ ని అందచేయకుండా చేసారు.

[one_half]

దీనిమూలంగా, క్రైస్తవ సంఘంలో పోప్ మరియు బిషప్పు వంటివారు కల్పించిన ఎన్నో మూఢాచారాలు పుట్టుకువచ్చి సంఘాన్ని దేవుని వాక్యనియమాల నుండి దారితప్పించే ప్రయత్నం చేసాయి.కానీ తరువాతి కాలంలో, ప్రభువు యొక్క మహా కృపను బట్టి, క్రైస్తవ సంఘంలో ఎంతోమంది సంఘసంస్కర్తలు పుట్టుకువచ్చి, రోమన్ కేథలిక్ సంస్థకు, వ్యతిరేకంగా వారి ప్రాణాల సైతం లెక్కచేయకుండా పోరాడి, బైబిల్ ని వారి చేతుల్లోనుండి విడిపించి, క్రైస్తవులందరికి అందుబాటులో ఉండేలా చేసి; ప్రతీ విశ్వాసీ కూడా పరిశుద్ధాత్ముని సహాయంతో, వాక్యాన్ని చదివి అర్ధం చేసుకోవచ్చని చెప్పారు.ఇప్పుడు మన చేతిలో బైబిల్ ఉంది అంటే, వారు చేసిన పోరాటానికి ప్రతిఫలమే, దీనికోసం ఎందరో సంఘస‌ంస్కర్తలు రోమన్ కేథలిక్ చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు.మన చేతుల్లో బైబిళ్లు ఉండడం ఎంత అవసరమో అలాగే ఆ బైబిల్ దేవుని వాక్యం గనుక దానిని చదివి, వివరించడంలో జాగ్రత్త మరియు శ్రద్ధ వహించడం కూడా, అంతే అవసరం.

[/one_half][one_half_last][quote]వాక్యాన్ని చదివేటప్పుడు ఒకదానికి ఒకటి విరుద్ధమైనదిగా మనము అర్ధం చేసికొనకూడదు.
మనము ఎల్లప్పుడూ బైబిల్ యొక్క వివిధ భాగాల మధ్య సామరస్యాన్ని వెతుకుతూ ఉండాలి [/quote][/one_half_last]సువార్త యొక్క ముఖ్యమైన అంశాలు పిల్లలకి కూడా అర్థమయ్యేంత స్పష్టంగా ఉన్నాయని మనకి బైబిల్ బోధిస్తుంది.దేవుడు అల్లరికి కర్తకాడు కనుక వాక్యాన్ని చదివేటప్పుడు ఒకదానికి ఒకటి విరుద్ధమైనదిగా మనము అర్ధం చేసికొనకూడదు. మనము ఎల్లప్పుడూ బైబిల్ యొక్క వివిధ భాగాల మధ్య సామరస్యాన్ని వెతుకుతూ ఉండాలి.

Author
Isaac

Further reading

పాపం అంటే ఏంటి?

పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి.

EP 01 : Introduction

Welcome to life and Scripture: Discovering God’s truth for everyday living. Welcome to the very first episode of Life and Scripture ! I’m...