బైబిల్ ఎందుకు చదవాలి అనే ప్రశ్నకు ముందు బైబిల్ గ్రంథములో ఏముందో ముందు తెలుసుకుందాం. దేవునిచే దేవుని ప్రజలకు ఇవ్వబడిన దేవుని వాక్యముగా బైబిల్ గ్రంథమును మనం నిర్వచించవచ్చు. దేవుని గుణలక్షణాలు,సృష్టి క్రమం, మానవ నిర్మాణం, పాపము దాని ప్రభావం,మానవ పతనం, దేవుని ఉగ్రత, మానవ పాప విమోచన ప్రణాళిక, దేవుని కుమారునిజనన మరణ పునరుత్తానం, విశ్వాస జీవితం, నూతన సృష్టి మొదలైన విషయాల గూర్చి కూలంకషంగా చర్చించిన చారిత్రాత్మక సత్య గ్రంథం బైబిల్.
యేసుక్రీస్తు యందు విశ్వాసముంచిన ప్రజలకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదముగా బైబిల్ గ్రంథమును పేర్కొనవచ్చును. విశ్వాసి యొక్క జీవితానికి ప్రామాణికం బైబిల్ వాక్యం. అందుకే విశ్వాసులు తప్పకుండా ఈ పుస్తకాన్ని చదివి, ధ్యానించాల్సిన అవసరం ఉన్నది. కీర్తనాకారుడు రచించిన 119వ కీర్తనలో దేవుని ఆజ్ఞలు, దేవుని ఉపదేశములను గూర్చిన వివరణ ఇవ్వబడింది. కొత్త నిబంధన గ్రంథం అప్పటికి రాయబడలేకపోయినా,ఈ కీర్తన ద్వారా దేవుని గ్రంథమైన బైబిల్ ఎందుకు ధ్యానించాలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
[one_half]1. 119:2-3 – ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు.
119:11 – నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.
పాపమనగా ఏమిటి,పాపము నుండి తప్పించే మార్గము ,పాపము వలన కలిగే ఫలితాలు మొదలైన విషయాలు దేవుని వాక్యమునుండి మనం తెలుసుకొనగలం కావున, ఈ వాక్యమును ధ్యానించవలసిన అవసరమున్నది.
119:18 నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరువుము.
ఆయన ఆశ్చర్యకరుడు,ఆలోచనకర్తయైన దేవుడు. ఆ దేవుని గూర్చిన అద్భుతమైన విషయాలు,ఆశ్చర్య కార్యాలు వాక్యములోనే గమనించగలం. మనం దేవుని గూర్చిన లోతైన విషయాలు తెలుసుకోడానికి ఆయన శాస్త్రాన్నిచదవాలి.దేవుని గూర్చి తెలుసుకోవడమే మన ప్రాథమిక విధి కదా.
[/one_half] [one_half_last][quote] దేవుని కుమారునిజనన మరణ పునరుత్తానం, విశ్వాస జీవితం, నూతన సృష్టి మొదలైన విషయాల గూర్చి కూలంకషంగా చర్చించిన చారిత్రాత్మక సత్య గ్రంథం బైబిల్.[/quote][/one_half_last]119:18 నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరువుము.
ఆయన ఆశ్చర్యకరుడు,ఆలోచనకర్తయైన దేవుడు. ఆ దేవుని గూర్చిన అద్భుతమైన విషయాలు,ఆశ్చర్య కార్యాలు వాక్యములోనే గమనించగలం. మనం దేవుని గూర్చిన లోతైన విషయాలు తెలుసుకోడానికి ఆయన శాస్త్రాన్నిచదవాలి.దేవుని గూర్చి తెలుసుకోవడమే మన ప్రాథమిక విధి కదా.
119:38 – నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది.
దేవుని వాక్యము, మనుష్యులకు దేవుని భయమును గుర్తుచేస్తుంది.దేవుని భయము లేకపోతే జరిగే అనర్థాలు అన్ని ఇన్ని కావని మనకు తెలిసిందే. దేవుని భయమువలన దేవుణ్ణి భయభక్తులతో సేవించే అవకాశమున్నది కావున వాక్యం చదవాల్సిన అవసరం ఉన్నది.
119:50 – నీ వాక్యమే నన్ను బ్రతికించియున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.
మన బాధలలో, వేదనలలో, ఇరుకుల్లో ఇబ్బందుల్లో దేవుని వాక్యము నెమ్మదినిస్తుంది. మన శ్రమలలో ఆయన సహాయం, వాగ్దానములను ధ్యానించినపుడు అవి మనలను ప్రోత్సాహపరుస్తాయి కావున దేవుని వాక్యం చదవాల్సిన అవసరత యున్నది.
119:66 – నేను నీ ఆజ్ఞల యందు నమ్మికయుంచియున్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము.
దేవుని ఆజ్ఞలు మనకు జ్ఞానమును వివేచననిస్తాయి. కావున వాటిని ధ్యానించ బద్ధులమైయున్నాము. లోకజ్ఞానము విస్తరిస్తున్న నేటి దినాల్లో దేవుని వాక్యము దైవానుసారమైన ఙ్ఞానములో నడిపించే సాధనమైయున్నది
119:72, 127 – వేల కొలది వెండి బంగారు నాణెములకంటె నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు.
వాక్యము విలువ తెలియకపోవడం వలన ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుని వాక్యము భూసంబంధ సంపద కన్నా విలువైనది. కావున, ఆ వాక్యాన్ని సంపాదించుకోవాల్సినవారమై యున్నాము.
119:103, 111 – నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటే తీపిగా నున్నవి.నీ శాసనములు నాకు హృదయానందకరములు.
దేవుని వాక్యము అంతరంగ హృదయముకు ఎంతో సంతోషమును అందిస్తుంది కావున మనం వాక్యమును హృదయములో భద్రపరుచుకోవాల్సినవారమై యున్నాము.
119:105 – నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.
దేవుని వాక్యము మన అనుదిన జీవితాలకు అవసరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో సహాయం చేసే గొప్ప సాధనమైయున్నది కావున మనం ఆ వాక్యమును చదివి ధ్యానించి విధేయత చూపవలసిన వారమై ఉన్నాం.
119:142,160 – నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. నీ వాక్య సారాంశము సత్యము.
ఎన్నో మతాల పుస్తకాలున్నను, ఎన్నో తత్వశాస్త్ర గ్రంథాలున్నను వాటన్నిటికంటే గొప్పదైన దేవుని వాక్యము సత్యమైనది శాశ్వతమైనది కాబట్టి మనం దాన్ని ధ్యానించవలసిన అవసరత ఉన్నది.
119:164, 171 – నీ న్యాయవిధులను బట్టి దినమునకు ఏడుమారులు నేను నిన్ను స్తుతించుచున్నాను.నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రమునుచ్చరించును.
అతి ప్రాముఖ్యంగా దేవుడు ఏమైయున్నాడో, ఆయన గుణ లక్షణాలను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి ఆయనను స్తుతించడానికి దేవుని వాక్యం మనం ధ్యానించ బద్ధులమై ఉన్నాం.
చివరిగా అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం. 2 రెండవ తిమోతికి 3:16,17- దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది. మన క్రైస్తవ జీవితాలకు ప్రామాణికంగా చెప్పబడుతున్న బైబిల్ గ్రంథాన్ని చదవక, ధ్యానించక నిర్లక్ష్యం చేస్తున్న సోదర సోదరీమణులారా, ఇకనైనా కేవలం ఆదివారం మాత్రమే సంఘానికి వెళ్లేప్పుడు మాత్రమే కాక, ప్రతిరోజూ బైబిల్ చదవడం అలవాటు చేసుకోండి. దేవుని ప్రణాళిక మరియు ఆయన చిత్తమునెఱిగి ఆయన మహిమకై క్రైస్తవజీవితం కొనసాగించండి.