Home » దావీదు -గోలియాతు కథను ఎలా అర్థం చేసుకోవాలి?

దావీదు -గోలియాతు కథను ఎలా అర్థం చేసుకోవాలి?

దావీదు – గొల్యాతుల కథ నిస్సందేహంగా బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన సంఘటన. కానీ ఈ కథ లోని సందేశాన్ని తరచుగా అపార్ధం చేసుకుంటాము. ఎలాగంటే తమ ప్రాణాలను సహితం లెక్కచేయక ధైర్యసాహసాలను ప్రదర్శించిన వారిని, లేదా సమాజ సేవ చేసే వారిని, ప్రజలు గౌరవిస్తూ వీరులుగా గుర్తించడం వంటి సంగతులు మనము వింటుంటాం. అలాగే బాలుడైన దావీదు, గొల్యాతును ధైర్యముతో ఎదుర్కొన్న సన్నివేశం చదివినప్పుడు , దావీదు యొక్క ధైర్యసాహసాలను బట్టి వీరునిగా తలుస్తాం , అలాగే మన పిల్లలకి దావీదు వలే ధైర్యముగా ఉండాలని ప్రోత్సహపరుస్తాం . నిజానికి దావీదు దైర్యవంతుడే కానీ, ఈ కథ లోని సారాంశం దానికి సుదూరంగా ఉంది.

కథ ఇలా మొదలైయింది:

[one_half]

ఫిలిష్తీయులు ఏలా లోయకు అవతలివైపు, రాజైన సౌలు తన సైన్యముతో ఇవతలవైపు నిలిచి ఉన్నారు. గొల్యాతు అనే ఫిలిస్తీయులలోని శూరుడొకడు ఇశ్రాయేలీయులతో ద్వంద్వ పోరాటానికి ఆహ్వానిస్తూ సవాలు చేయుట మొదలు పెట్టాడు. అతని సవాలుని ఎదుర్కొనుటకు బదులుగా సౌలుతో సహా , ఇశ్రాయేలీయులు భయంతో వెనుకంజ వేసారు. ( 1 సమూయేలు 17:11). తన తండ్రి ఆజ్ఞ మేరకు దావీదు తన అన్నలకు ఆహారాన్ని ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, గొల్యాతు సవాలును విని, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు అని తన పక్కన ఉన్నవారితో అంటాడు( 1 సమూయేలు 17:26).

[/one_half] [one_half_last][quote] దావీదు విశ్వాసానికి ఆధారము దేవుడు మాత్రమేకానీ తన సొంత శక్తి, సామర్ధ్యము లో లేదు. [/quote][/one_half_last]

దావీదు , ఇశ్రాయేలీయులు నమ్మిన దేవుడు ఒక్కడే అయినప్పటికీ, వారి స్పందన ఎంత విరుద్దంగా ఉంది కదా? గొల్యాతు తలపడుతున్నది కేవలం మనుషులతో కాదు కానీ , తనకంటే బలవంతుడైన దేవునితో తలపడుతున్నాడన్న విషయం దావీదు ఎరిగి ఉన్నాడు కనుక అలాగు స్పందించాడు.

గోల్యాతుతో పోరాడాలనే దావీదు కోరిక విన్న సౌలు , అతనిని పిలచి, తనకున్న తెగువను, యుద్ధ నైపుణ్యతను ప్రశ్నిస్తాడు (1 సమూయేలు 17:13) అప్పుడు దావీదు, తాను గొఱ్ఱలను కాయునప్పుడు సింహము మరియు ఎలుగుబంటి యొక్క నోటి నుండి వాటిని రక్షించుటకు ఏ రీతిగా తన నైపుణ్యతను కనపరచాడన్న విషయాన్నీ సౌలుకు తెలియచేస్తాడు. కానీ వాస్తవానికి, అతని విశ్వాసం తన నైపుణ్యత మరియు, ధైర్యం కాదుకానీ , దేవునిపైనే ఉందని మనం స్పష్టంగా చూడవచ్చు ( 1 సమూయేలు 17:37). దావీదు దైర్యవంతుడే , అయితే ఈ ధైర్యానికి కారణం ఏంటి?

1. గొల్యాతు కంటే తాను నమ్మిన దేవుడు అపారశక్తి సంపన్నుడని దావీదుకు తెలుసు కనుకనే తనని ఎగతాళి చేసినను, వెనకంజ వేయక, విశ్వాసముతో ముందుకు వెళ్ళాడు. ( 1 సమూయేలు 17:45)
2. తనతో సైన్యములకు అధిపతియగు యెహోవా ఉన్నాడన్న విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు . ( 1 సమూయేలు 17:45)
3. ప్రభువు తనను గొల్యాతు చేతిలోకి అప్పగించడన్న ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. ( 1 సమూయేలు 17:46)
4. తాను నమ్మిన దేవుడు కత్తి చేతను, ఈటెచేతను రక్షించువాడు కాదుకానీ, తన అద్వితీయ శక్తిచేతనే రక్షించునని ఎరిగినవాడు ( 1 సమూయేలు 17:47)

క్లుప్తంగా చెప్పాలంటే , దావీదు గోల్యాతుని చంపి ఇశ్రాయేలీయులను పెద్ద విపత్తు నుండి తప్పించాడు. ఈ కథకు మనం ఎలా స్పందించాలి? ధైర్యంగా ఉండి మన జీవితంలోని అడ్డంకులను అధిగమించాలనా ? లేదా ధైర్యంగా గొల్యాతులాంటి మన వ్యక్తిగత బలహీనతలను హతమార్చాలనా? కాదు . జీవితంలోని ఎలాంటి కష్టతరమైన పరిస్థితులనైనా ఎదుర్కొనుటకు దావీదే మనకు ఉదాహరణ. ఎందుకంటే, దావీదు – గొల్యాతుల పోరాటంలో తాను కాదు యెహోవాయే యుద్ధము చేస్తాడని, తన ప్రజలను తప్పక రక్షిస్తాడని దావీదు నమ్మకం. దావీదు ధైర్యవంతుడని అనుటలో ఎటువంటి సందేహం లేదు. అయితే తన విశ్వాసానికి ఆధారము దేవుడు మాత్రమేకానీ తన సొంత శక్తి, లేదా సామర్ధ్యము లో లేదు. ఈ కథలో దావీదు క్రీస్తుకు సారూప్యంగా ఉన్నాడు. ఎలాగైతే దావీదు శత్రువులతో తలపడుటకు స్వచ్ఛందంగా పోరాడుటకు సిద్దపడ్డాడో , అలాగే క్రీస్తు కూడా పాపబంధకాలతో బలహీనులమైన మనలను (రోమా 5:6) విడిపించుటకు పైనుండి దిగి వచ్చాడు.

కోరేం డియో :
దావీదు వలే ప్రభువునందు నమ్మకయుంచి అయన కృపాసింహాసనము నొద్దకు వచ్చుట ద్వారా అయన దయను కృపను తగిన సమయంలో పొందెదము గాక! ( హెబ్రీ 4:16)

Author
Isaac

Further reading

పాపం అంటే ఏంటి?

పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి.