Home » దేవుడు ప్రేమ కనుక ఎవరినైనా ఎలాగున్న ప్రేమిస్తాడా?

దేవుడు ప్రేమ కనుక ఎవరినైనా ఎలాగున్న ప్రేమిస్తాడా?

దేవున్ని నిర్వచించటం అనేది సముద్రాన్ని ఒక సీసాలో బందించటం లాంటి అసాధ్యమైన సంగతి అయినప్పటికి బైబిల్ కొన్ని నిర్వచనాలను మన ముందు వుంచుతుంది…

[dropcap]ద[/dropcap]దేవున్ని నిర్వచించటం అనేది సముద్రాన్ని ఒక సీసాలో బందించటం లాంటి అసాధ్యమైన సంగతి అయినప్పటికి బైబిల్ కొన్ని నిర్వచనాలను మన ముందు వుంచుతుంది.
అలాంటి నిర్వచనాలలో సుపరిచితమైన నిర్వచనం “దేవుడు ప్రేమ స్వరూపి “ I John 4:8
ప్రేమ అనే పదం నేటి సమాజములో చాలా విస్తృతంగా వాడబడుతున్న పదం. అనేక సినిమాలు, పాటలు ప్రేమ అనే అంశము ఆధారముగానే నిర్మితమై యువతను విపరీతము గా ఆకట్టుకుంటున్నాయి. కనుకనే “దేవుడు ప్రేమ అయి యున్నాడు” అనే అంశాన్ని ఈ లోక ధృక్కోణంలోనే చూస్తున్నారు కనుకనే దేవుని ప్రేమను అపార్ధం చేసుకుంటున్నారు. అనేక మంది దేవుడు ప్రేమ కనుక ఎవరిని ద్వేషించాడు, శిక్షించాడు, కనుకనే నరకం అనేది ఒక మిధ్య. ప్రేమ అయిన దేవుడు నరకాన్ని సృష్టించి దాంట్లో కొంత మంది మనుష్యులను శిక్షించటం అసాధ్యమైన సంగతి అని వీరి అభిప్రాయం. ఇలాంటి అపోహలకు కారణమేమిటంటే దేవుడు ప్రేమ అయి యున్నాడు అనే విషయంను మాత్రమే పరిగణించి దేవుని ఇతర గుణ లక్షణాలను ఏ మాత్రము లక్ష్యము చేయక పోవటమే.
దేవుడు ప్రేమ అని చెప్పిన బైబిల్ దేవుడు పరిశుద్దుడు(Leviticus 19:2), దేవుడు దహించు అగ్ని (Heb 12:29)అని కూడా నిర్వచిస్తుంది. దేవుడు పాపాన్ని చూడలేని నిష్కళంకమైన కన్నులు గలవాడు. (Hab 1:13). ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దేవుడు ప్రేమ కనుక ఎవరినైనా ఎలాగున్న ప్రేమిస్తాడా?
[one_half] దేవుడు పాపాన్ని ప్రేమించటం అనేది అసాధ్యమైన సంగతి ఎందుకంటే దేవుడు పరిశుద్దుడు. (దేవుడు వెలుగై యున్నాడు ఆయన యందు చీకటి ఎంతమాత్రము లేదు – I John) దేవుడు పాపులను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు అనే మహాత్మా గాంధీ నానుడి మనం వినే వుంటాం. కానీ మనుష్యులను దేవుడు ప్రేమించటానికి వారిలో ఏముంది పాపము తప్ప. ఏ బేధమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోతున్నారు. (రోమా 3:23) కనుకనే ఏ మనుష్యుడు కూడా దేవుని చేత ప్రేమింప బడలేడు కారణం మానవుని పాపమే.(Romans 3:20).దేవుని ప్రేమకు అర్హుడైన ఏకైక వ్యక్తి తన కుమారుడైన యేసు క్రీస్తు మాత్రమే (Matthew 4:17)[/one_half][one_half_last][quote]పాపములో నిలిచి యుంటు, పాశత్తాపము, మరుమన్స్సు, రక్షణ లేకుండ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటే పొరపాటే[/quote][/one_half_last]

దేవుడు పాపులైన మనుష్యులను ప్రేమించి ఏ పాపమెరుగని పరిశుద్దుడైన తన కుమారుడైన యేసు ప్రభువును మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపేను. ఇందులో ప్రేమ యున్నది (I John 4:10). యేసు ప్రభు మన స్థానములో మనకు బదులుగా మన పాప శిక్ష అనుభవించిన కారణాన్ని బట్టి ఇప్పుడు క్రీస్తులో దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. విశ్వాసులమైన మన దైర్యం ఏమిటంటే క్రీస్తును బట్టి మనము క్రీస్తులో వున్న కారణాన్ని బట్టి దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు తప్ప, మన భక్తి, మన సేవ, మన క్రియలు ఏవేవీ కూడా దేవునిని మన వైపు ఆకర్షితుణ్ణి చేయలేవు. క్రీస్తు నందు అనే పదము పౌలు పత్రికలలో దాదాపు 75 సార్లు వాడబడింది.కనుకనే దేవునికి మన పట్ల వున్న ప్రేమ 1. గొప్ప ప్రేమ –Eph 2:42. శాశ్వతమైన ప్రేమ –Jer  31:33. నూతనపరచ బడుచున్న ప్రేమ – Lamentations 3:23

ఇంత గొప్ప దేవుని ప్రేమను పొందుటకు అర్హత లేకున్న క్రీస్తును బట్టి మనము పాత్రులముగా ఎంచబడుచున్నాము గనుక దేవుని ఆరాధించుదము.ఒకవేళ నీవు క్రీస్తులో విశ్వాసము వుంచక పోయిన యెడల దేవుని ప్రేమకు నీవు పాత్రుడవు కావు గాని దేవుని వుగ్రతకు కోపమునకు పాత్రుడవు(John 3:36) స్వభావ సిద్దముగానే మానవులు దైవోగ్రతకు పాత్రులు( Eph 2:3) బైబిల్ లో దేవుని భయంకరమైన వుగ్రత గురించి కూడా విస్తృతముగా చెప్పబడింది. ఆయన ఉగ్రత తీర్పు దినమున బయలు పరచబడనున్నది. అయితే ఆయన యందు విశ్వసముంచిన వారు తీర్పు లోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటియున్నారని యేసు ప్రభువే చెప్పారు (John 5:23)కనుకనే పాపములో నిలిచి యుంటు, పాశత్తాపము, మరుమన్స్సు, రక్షణ లేకుండ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటే పొరపాటే. అదేవిధము గా రక్షణ పొందిన వారు కూడా గ్రహించాల్సిన విషయమేమిటంటే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమకు కారణము యేసు ప్రభువే తప్ప మన భక్తి, మన సేవ, మన జీవితం కాదు. కనుకనే దీనులమై ప్రభువు కు కృతజ్ఞ్యులమై జీవించుదము.

Further reading

పాపం అంటే ఏంటి?

పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి.