Home » క్రీస్తు ప్రాయశ్చిత్తం గురించి తెలుసుకోవలసిన 5 విషయాలు

క్రీస్తు ప్రాయశ్చిత్తం గురించి తెలుసుకోవలసిన 5 విషయాలు

ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? ప్రాయశ్చిత్తానికి కారణం ఏమిటి?

1. ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి?
క్రీస్తు తన జీవితం మరియు మరణం ద్వారా మన రక్షణను సంపాదించేందుకు చేసిన పనిని ప్రాయశ్చిత్తం అంటాము.

2. ప్రాయశ్చిత్తానికి కారణం ఏమిటి?
క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపాల కోసం చనిపోవడానికి దారితీసిన అంతిమ కారణం ఏమిటి? మనం ఈ ప్రశ్నకు జవాబును దేవుని స్వభావంలోనే వెదకి తెలుసుకోవాలి.
వాక్యం దానికి దేవుని ప్రేమ, మరియు ఆయన న్యాయమనే సమాధానాలను ఇస్తుంది.

దేవుని ప్రేమ ప్రాయశ్చిత్తానికి ఒక కారణమని వివరించడానికి వాక్యం యోహాను 3:16 ను చూపిస్తుంది.
ఇది మనకి బాగా తెలిసిన వాక్య భాగమే; దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.  ఆయనను అనుగ్రహించెను.
క్రీస్తు లోకానికి వచ్చిచనిపోడానికి  ఒక కారణం అయన ప్రేమ. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. 1 యోహాను 4:10.

రెండవది, అయన న్యాయమంతుడు కనుక, మన పాప జీవితము  ద్వారా మనం కూడబెట్టుకున్న పాపానికి వెల చెల్లించే మార్గాన్ని కూడా అయనే మనకోసం తెరచాడు.  ఈ  మార్గము ద్వారా తన న్యాయమైన ఉగ్రతనకు క్రీస్తు మరణం ద్వారా పరిహారము లభించింది. అందువల్ల దేవుని ప్రేమ మరియు ఆయన న్యాయం రెండూ కూడా ప్రాయశ్చిత్తానికి అంతిమ కారణాలు.

3. ప్రాయశ్చిత్తం యొక్క అవసరత ఏమిటి?
మన స్థానంలో చనిపోవడానికి తన కుమారుడిని పంపించడం కాకుండా మానవాళిని రక్షించడానికి దేవునికి వేరే మార్గం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే ముందు, దేవునికి ఏ జనాన్ని కూడా రక్షించాల్సిన అవసరం లేదనేది మనం గ్రహించడం చాలా ముఖ్యం.

దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. 2 పేతురు 2:4.
ఈ వాక్యము ఆధారంగా చూసుకుంటే , దేవుడు పాపులమైన మనలను కూడా న్యాయంగా, దేవదూతలను ఏవిధంగా ఐతే రక్షించకూడదని నిర్ణయించుకున్నాడో , అలాగే మనుషుల్లో ఎవరునీ కూశా రక్షించకుండా శిక్షవిధించియుండవచ్చు.
కాబట్టి ఈ కోణంలో మనం ఆలోచిస్తే నిజానికి  ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా అవసరం లేదు.

దేవుడు , తన ప్రేమలో, కొంతమంది మనుషులని రక్షించాలని నిర్ణయించుకున్నాడు, దేవుని కుమారుని మరణం ద్వారానే తప్ప వేరే ఏ మార్గమూ లేదని లేఖనంలోని అనేక భాగాలు సూచిస్తున్నాయి.
అందువల్ల, ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా అవసరం లేదు, కానీ  కొంతమంది మనుషులను రక్షించాలనే దేవుని నిర్ణయం యొక్క ‘పర్యవసానంగా’ ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా అవసరం.

4. క్రీస్తు ఎవరి కోసం ప్రాయశ్చిత్తుడయ్యాడు ?
క్రీస్తు సిలువపై మరణించినప్పుడు, తాను మానవ జాతి ప్రతి ఒక్కరి పాపాలకు వెల చెల్లించాడా లేక చివరికి రక్షింపబడతాడని తనకు తెలిసిన వారి పాపాలకు మాత్రమే చెల్లించాడా?
Reformed వేదాంతవేత్తలు మరియు ఇతర కాథలిక్ మరియు ప్రొటెస్టంట్ వేదాంతవేత్తల మధ్య వ్యత్యాసాలలో ఒకటి,  క్రీస్తు ప్రాయశ్చిత్తం ఎవరికోసం చేసాడు అన్నది.
ఈ అంశం గురించి బోధించే సిద్ధాంతాన్ని, రెఫార్మేడ్ దైవశాస్త్రం (Reformed Theology) లో లిమిటెడ్ ఆటోన్మెంట్ (Limited  Atonement or particular Redemption) అంటారు. ఈ సిద్ధాంతం వాక్యానికి దగ్గరగా ,స్థిరమైనది గా ఉందని మనకి అర్థం ఔతుంది.

క్రీస్తు సిలువలో లోకంలో ఉన్న ప్రతి మనిషి కొరకు తన రక్తం కార్చలేదనడానికి, తనను విశ్వసించిన మరియా విశ్వసించబోవు వారి కోసమే చనిపోయాడు అనడానికి వాక్యానుసారమైన ఆధారాలు చాలా ఉన్నాయి.

నేను గొఱ్ఱలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱలకొరకు తన ప్రాణము పెట్టును. యోహాను 10:11.
తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱలను ఎరుగుదును, నా గొఱ్ఱలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. యోహాను 10:15.

పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ చెప్పిన మాటలను గమనిద్దాం.
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అపొస్తలుల కార్యములు 20:28.

అలాగే రోమా 8:32-33 వ వచనంలో కూడా, మనకి ఇది స్పష్టమౌతుంది.
తన సొంతకుమారుని అనుగ్ర హించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు?
(33వ) దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే;

ఇక్కడ, ‘మన అందరికి కొరకు అప్పగించినవాడు’ అంటూ , తరువాత వచనంలో ‘దేవునిచేత ఏర్పరచబడిన’ అనడానికి గల సంబంధాన్ని మనం గమనించాలి.
అంత మాత్రమే కాక, ‘సమస్తము’ అన్న మాటలో, రక్షణ కూడా మిళితమైయున్నది.
కాబట్టి, క్రీస్తు సిలువలో తన్నుతాను అప్పగించుకున్నది, దేవునిచేత ఏర్పరచబడిన వారిమీదనే కానీ ప్రతి ఒక్కరి కొరకు కాదని నిర్ధారణ ఔతుంది.

5. ప్రాయశ్చిత్తం యొక్క లాభం ఏమిటి?
ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి మరియు ప్రాయశ్చిత్తం యొక్క ఇతర సంబంధిత అంశాలను క్లుప్తంగా చూశాము.
ఇప్పుడు, ప్రాయశ్చిత్తం యొక్క అనేక ప్రయోజనాలలో కొన్నిటిని క్లుప్తంగా పరిశీలిద్దాం.

యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తం మన సొంత కార్యాలతో  సాధించలేనిదాన్ని సాధించింది. అనగా, రక్షణ ని మనకి సంపాదించింది.

1. క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు. (మనం ఇంత వరకు చేసిన పాపాలు‌ మరియు , ఈ భూమిపై మనముండే మిగిలినకాలం వరకూ చేసే పాపాల కొరకూ) (రోమా 5:6-8, 1 కొరింథీ 15:3)

2. ప్రాయశ్చిత్తం మనకు నిత్యమైన విమోచనని కొనుగోలు చేసి సంపాదించి పెట్టింది. (హెబ్రీ 9: 11-12)

3. ప్రాయశ్చిత్తం దేవునికొరకు,  ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను మనుష్యులను కొనుగోలు చేసింది ( ప్రకటన 5: 9-10)

4. యేసుక్రీస్తు యొక్క  ప్రాయశ్చిత్త కార్యము పాపులను ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసింది. (ప్రకటన 5-9-10)

5. యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తం పాపిని నీతిమంతునిగా ప్రకటించింది. (రోమా  3: 21-26)

6. ప్రాయశ్చిత్తం ద్వారా దేవునితో మనమంతా సమాధానపరచబడ్డాము. (రోమా 5: 6-11)

క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క శక్తిని మరియు దాని నుండి వచ్చే ప్రయోజనాలను‌ మనం గుర్తించిన తరువాత, మన హృదయం మరియు మనస్సులో విస్మయం కృతజ్ఞతభావం లేకుండా ఉండలేము
మనము పాపులుగా ఉన్నప్పుడే , క్రీస్తు మన స్థానంలో మరణించాడు, దానిని బట్టి ఎల్లప్పుడూ భూమిమీదను, పరలోకమందును   కృతజ్ఞులుగా ఉండవలసిన వారము.
దీన్ని దృష్టిలో పెట్టుకుని, మన దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమిద్దాం మరియు ఆయన మాటకు కృతజ్ఞతతో విధేయత చూపుదాం.

యుగయుగములు దేవునికే మహిమ, ఆమేన్.

 

 

Author
Isaac

Further reading

పాపం అంటే ఏంటి?

పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి.