1. … కృపచేతనే రక్షింపబడియున్నారు (ఎఫెసీయులకు 2:8)
మన పిల్లలకు దేవుని వాక్యాన్ని పరిచయం చేయడం,బోధించడం తల్లితండ్రులుగా మన కర్తవ్యం(ద్వితియోపదేశకాండము 11:19). దేవుని పాటలు నేర్పించడం , బైబిల్ కథలు చెప్పడం చాల మంచిది. కానీ అవి వాళ్ళకి రక్షణను కలుగ చేయదు, అది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే అని మర్చిపోకూడదు. దేవుడు మన పిల్లల పట్ల కృపను చూపించమని రోజూ ప్రార్ధన చేద్దాం.[one_half]
2. విశ్వాసముద్వారా … రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే (ఎఫెసీయులకు 2:8)
మన పిల్లలు చూడలేని వాటిని నమ్మడం కొన్నిసార్లు కష్టం. కానీ విశ్వాసం అనేది మనం చూడలేనిదాన్ని నమ్మడం. రక్షింపబడటానికి విశ్వాసం అవసరం. కాబట్టి, పిల్లలు తమ బాల్యం నుండే విశ్వాసం కలిగి ఉండాలని ప్రార్థిద్దాం.
3. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.(ఎఫెసీయులకు 2:9)
మన పిల్లలు వారి చిన్న మనస్సులతో ఏమి సాధించగలరో చూసినప్పుడు మనము గర్విస్తాము. వారు తమ పాఠశాల అదనపు పాఠ్యాంశ కార్యకలాపాల్లో విజయం సాధించిన వాటిని తరచుగా మాకు చూపిస్తారు. మంచి గ్రేడ్‌లు, బహుమతులు పొందడానికి వారు చాలా కష్టపడాల్సి ఉంటుందని వారికి తెలుసు. వారు రక్షణను కూడా సంపాదించాల్సిన అవసరం ఉందని వారు భావించడం కూడా సహజం . మన అతిశయం క్రీస్తులో మాత్రమే ఉన్నాయని వారు స్పష్టంగా అర్థం చేసుకోవాలని ప్రార్థించండి.
4. వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై (ఎఫెసీయులకు 2:10)
యాకోబు , “విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును” అని చెప్పాడు. అలాగే,మన పిల్లల విశ్వాసం మంచిపనులకుకు దారితీయాలని, దేవుడు మహిమ పరచబడాలి అని ప్రార్ధన చేద్దాం.
[/one_half][one_half_last][quote] మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.
ఎఫెసీయులకు 2:8-10
[/quote][/one_half_last]